English | Telugu

Krishna Mukunda Murari : నన్ను క్షమించు.. తన మీద ఉన్న ప్రేమ నన్ను ఇలా చేపిస్తోంది!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి .ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -389 లో.... కృష్ణ, ముకుంద, మురారి, అదర్శ్ అందరు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ అందరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఈ జరిగిన సంఘటనలు గుర్తుకుచేసుకొని కృష్ణ భాదపడుతుంటే.. అవన్నీ సహజమైనవని , పట్టించుకోకూడదని ఆదర్శ్ చెప్తాడు. ఆ తర్వాత కొబ్బరి కాయ కొట్టి ప్రసాదం అందరికి ఇద్దామనుకున్న ఆదర్శ్ కుడి చేతి నలిగిపోతుంది‌‌. దాంతో ఆదర్శ్ నొప్పితో ఇబ్బంది పడుతుంటాడు.

ఇక కృష్ణ, మురారి చూస్తారు. అయితే అదే సమయంలో ముకుంద పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తుంటుంది. అది గమనించిన కృష్ణ.. ఏంటి ముకుంద అలా ఉన్నావ్.. ఆదర్శ్ కు గాయమైందని అనగానే ఏం రియాక్ట్ అవ్వదు. ఆ తర్వాత ఆదర్శ్ లో మురారిని చూసుకొని .. చాలా కేరింగ్ చూపిస్తుంది ముకుంద‌. అది చూసిన కృష్ణ, మురారి సంబరపడతారు. ఆ తర్వాత అందరు కలిసి కార్ లో వెళ్తుంటే మల్లెపూల షాప్ దగ్గర కార్ ఆపుతాడు మురారి. ఇక అక్కడికి కృష్ణ, మురారి వెళ్ళి నాలుగు మూరల మల్లెపూలు తీసుకొని కార్ దగ్గరకి వస్తారు. ఇక ముకుంద జడలో ఆదర్శ్ మల్లెపూలు పెట్టాలని కృష్ణ అంటుంది. ఇక ఆదర్శ మల్లెపూలు పెడుతుంటే ముకుంద వద్దని అంటుంది‌. అది విని కృష్ణ, మురారీలతో పాటు ఆదర్శ్ షాక్ అవుతాడు. వీళ్ళకి డౌట్ వచ్చిందేమోనని కాసేపటికి ముకుంద నవ్వుతుంది. దాంతో అది అర్థం చేసుకుని ఆదర్శ్ తన జడలో మల్లెపూలు పెడతాడు. ఇక అదే సమయంలో కృష్ణ జడలో మురారి మల్లెపూలు పెడతాడు. ఇక ఆ తర్వాత అందరు కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్తారు.

ఎవరికి ఏం కావాలో చెప్పండి అని మురారి అనగానే.. ముకుంద ఏం తింటే ఆదర్శ్ కూడా అదే‌ తింటాడు కదా అని కృష్ణ అంటుంది. ‌అయ్యో ఎక్కడెకెళ్ళిన ఈ కృష్ణ నన్ను ఇలా ఇబ్బంది పెడుతుందేంటని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత బేరర్ రాగానే వాళ్ళకి కావల్సిన లిస్ట్ చెప్తారు. కాసేపటికి ఫుడ్ వస్తుంది. అది తినడానికి ఆదర్శ్ ఇబ్బంది పడతాడు. నీకెందుకు ఇబ్బంది నేను తినిపిస్తాను కదా అని మురారి అనగానే.. అయ్యో ఏబీసీడీల అబ్బాయి, మీరెందుకు తినిపించడం.. ముకుంద ఉంది కదా తను తినిపిస్తుందని అనగానే అవును కదా అని మురారి అంటాడు. ఆ తర్వాత ముకుంద మళ్ళీ కాసేపు పరధ్యానంలోకి వెళ్తుంది. ఇక ఆదర్శ్ స్థానంలో మురారిని ఊహించుకొని అతనికి ఫుడ్ తినిపిస్తుంది ముకుంద. నన్ను క్షమించు ఆదర్శ్.. ‌నాకు మురారి మీద ఉన్న ప్రేమ‌ ఇలా చేపిస్తోందని ముకుంద తన మనసులో అనుకుంటుంది. అదే ప్లేట్ లో తినొచ్చు కదా అని ముకుంద, ఆదర్శ్ తో కృష్ణ అనగానే వాళ్ళిద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం‌ జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు‌ ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.