English | Telugu

Eto Vellipoyindhi Manasu : వాళ్ళ ప్రేమ గుట్టు బయటపడింది.. రామలక్ష్మికి డ్రైవర్ జాబ్ వచ్చేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -17 లో.. ధన, సిరి ఇద్దరు ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటారు. మన ప్రేమ విషయం ఇండైరెక్ట్ గా అయిన సరే మీ అన్నయ్యకి చెప్పు అని సిరితో ధన అంటాడు.. సరే గాని ఇప్పుడు ఎందుకు ఎగ్జామ్స్ అయ్యాక చెప్తానని ధనని హగ్ చేసుకుంటుంది. మరొకవైపు అటుగా వెళ్తున్న శ్రీవల్లి.. అక్కడ సిరి కార్ ఉండడం చుసి ఆగుతుంది. అక్కడ ధనని హగ్ చేసుకొని ఉన్న సిరిని చూసి షాక్ అవుతుంది. వెంటనే తన ఫోన్ లో ఫొటోస్ తీసుకుంటుంది.

ఆ తర్వాత సిరి కోసం తన రూమ్ లో శ్రీవల్లి వెయిట్ చేస్తుంది. సిరి రాగానే అతని పేరేంటని అడుగుతుంది. ఎవరని సిరి బయపడుతుంది. నాకు తెలుసు అంటూ తన ఫోన్ లో ఉన్న ఫోటోని చూపిస్తుంది. నువ్వు టెన్షన్ పడకు.. నేను ఎవరికీ చెప్పను.. నా ఫుల్ సపోర్ట్ నీకే. అంటు ధన గురించి అడిగి తెలుసుకుంటుంది. ఆ తర్వాత బావగారిపై గురి పెట్టడానికి నిన్ను వాడతానని శ్రీవల్లి తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి ప్రాబ్లెమ్ లో ఉన్న విషయం సీతాకాంత్ గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే తన తాతయ్య వస్తాడు. ఆ అమ్మాయి ప్రాబ్లమ్ లో ఉందని చెప్తాడు. నువ్వు ఒక అమ్మాయి గురించి ఆలోచించడమా అని వాళ్ళ తాతయ్య ఆశ్చర్యపోతాడు. మనం ఏదో రకంగా హెల్ప్ చెయ్యాలని సీతాకాంత్ అనగానే.. నేను చూసుకుంటానని తాతయ్య అంటాడు. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య పిఏ, డ్రైవర్ లు ఆ అమ్మాయికి ఎలా హెల్ప్ చెయ్యాలా అని ఆలోచిస్తారు. ఎప్పుడు అమ్మాయిల వంక చూడని సీతాకాంత్.. ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడంటే వింతగా ఉంది. వాళ్ళని జంటగా చెయ్యాలని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అనగానే.. వాళ్ళు సరేనని అంటారు.. ఆ అమ్మాయి డ్రైవర్ కాబట్టి సీతాకాంత్ కార్ కి డ్రైవర్ గా జాబ్ ఇవ్వాలని అందరు అనుకుంటారు.

ఆ తర్వాత ఉదయం రామలక్ష్మి నిద్ర లేవగానే పేపర్ లో వాంటెడ్ డ్రైవర్ అని ఉంటుంది. పాల డబ్బాల పైన కూడా రాసి ఉంటుంది. ఇంటి ముందు గోడకు కూడా ఉంటుంది అది చూసి మంచి ఛాన్స్ అక్క అని పింకీ అంటుంది. సరేనని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ధన, సిరి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. మరొకవైపు సిరి ఎవరినో ప్రేమిస్తుందని, వాళ్ళిద్దరు హగ్ చేసుకున్న ఫోటోని సందీప్ కి శ్రీవల్లి చూపిస్తుంది. సందీప్ కోపంగా వాళ్ళ అమ్మ శ్రీలత దగ్గరకి వెళ్లి చెప్తాడు. ఆ మిడిల్ క్లాస్ వాన్ని ప్రేమించడమేంటి.. సీతాకాంత్ కి చెప్పకండి.. చెప్తే సిరిపై ఉన్న ప్రేమతో వాడికే ఇచ్చి చేస్తాడు. వాని సంగతి చెప్దాం పదా అంటు సందీప్ ని తీసుకొని శ్రీలత వెళ్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ తాతయ్య.. రామలక్ష్మి రావడం లేదని ఎదురు చూస్తుంటాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.