English | Telugu

Krishna Mukunda Murari : మురారీతో పాటు ముకుంద మిస్సింగ్.. అత్తపై కోడలికి అనుమానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -482 లో.. కృష్ణ తనని ప్రేమగా చూసుకొని ఇద్దరూ అమ్మలు లాంటి అత్తల్ని మోసం చేస్తున్నానని లేని గర్భం ఉన్నట్లు నటించడం చాలా కష్టమని ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదని ఏడుస్తుంది. ఇక ప్రభాకర్, శకుంతలలు కృష్ణ గురించి వెతుకుతూ ఉంటారు. భవాని కూడా అందర్ని వెతుకుతుంటుంది. ఓ దగ్గర ఉండి కృష్ణ భాదపడుతుంది. కాసేపటికి కృష్ణని ప్రభాకర్, శకుంతల, భవాని చూసి‌ తన దగ్గరికి వచ్చేస్తారు.

పల్లకి సేవ ఉంది అని కృష్ణ, భవానీలని పల్లకి మోయమని ప్రభాకర్ చెప్తాడు. దాంతో ఇద్దరు ఆలోచనలో పడతారు. మనసులో.. ఏ కల్మషం లేని వాళ్లే పల్లకి మోయాలి కదా. మురారి అంత పని చేశాడు అని చెప్పని నేను కల్మషం లేని దాన్ని ఎలా అవుతానని భవాని అనుకోగా.. మనసులో.. లేని బిడ్డను మోస్తున్నట్లు అందరినీ నమ్మిస్తున్న నేను కల్మషం లేనిదాన్ని ఎలా అవుతాను. దేవుడి పల్లకి మోసే అర్హత నాకు ఉందా అసలు అని కృష్ణ అనుకుంటారు. ఏంటి ఆలోచిస్తున్నారు పల్లకి సేవకి టైమ్ అవుతుంది రండి అని ప్రభాకర్ వాళ్ళిద్దరిని తీసుకెళ్తాడు. మరోవైపు మీరాకి పాలు ఇవ్వడం కోసం తన రూమ్ కి వచ్చి రేవతి చూస్తే కనపడదు.. ఇక ఇల్లంతా వెతుకుంటుంది. పాలు ఎందుకు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నీ కొడుకే తండ్రి అని నమ్ముతున్నావా... అప్పుడే సపర్యలు మొదలు పెట్టేశావా అని రజిని అడుగుతుంది. వదినా పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు. మీరా చెప్పేది నిజం కావొచ్చు అబద్ధం కావొచ్చు. కానీ తను తల్లి కాబోతున్న నిజం కాదా. తల్లి బుద్ధి బాలేకపోతే ఆ బిడ్డ ఏం చేస్తుంది. బిడ్డ కోసం అయినా టైంకి పాలు, భోజనం ఇవ్వాలి కదా. ఇంతకీ నువ్వు మీరాని చూశావా లేదా. పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు ఎక్కడికి వెళ్లింది ఈ పిల్ల. అని అందర్ని అడుగుతుంది రేవతి.

పోతే దరిద్రం పోయిందని వదిలేయక దాని కోసం వెతుకుతారు ఎందుకని అదర్శ్ అనగానే.. ఆదర్శ్‌ ఈ ఆవేశమే వద్దు అనేది. నవ్వు చేపిన పనికి భయపడి ఏ అఘాయిత్యం చేసుకుంటే ఏంటి పరిస్థితి. అందరూ మీరా ఎక్కడ ఉందో వెతకండి అంటూ రేవతి చెప్తుంది. మరోవైపు భవాని, కృష్ణ ఇద్దరూ పల్లకి మోస్తారు. అయితే మధ్యలో పల్లకిలోని అమ్మవారి విగ్రహం పడిపోబోతే పంతులు పట్టుకుంటారు.ఇలా జరగడం అపచారం అని ఎవరో మనసులో ఏదో పెట్టుకొని పైకి మంచివారిలా నటిస్తూ ఇక్కడ ఉన్నారని అందుకే ఇలా జరిగిందని అంటాడు. అందుకే అమ్మవారి పల్లకిసేవ పూర్తి కానివ్వలేదని అంటుంది. కాసేపటికి భవాని మురారి గురించి వెంటనే ఎంక్వైరీ చేయాలని బయల్దేరుతానని అంటుంది. కృష్ణ కూడా వచ్చేస్తానని అంటే భవాని వద్దనేస్తుంది. మురారిని దగ్గరుండి చూసుకోవాలని వస్తానని కృష్ణ అనగా.. కృష్ణని ఉండమని, రావొద్దని చెప్పి భవాని బయల్దేరి వెళ్లిపోతుంది. తన అత్తయ్య తీరు అనుమానంగా ఉందని కృష్ణ అనుకోగా.. మరోవైపు ప్రభాకర్ కృష్ణ, భవానిల తీరు అనుమానంగా ఉందని ఇంట్లో ఏదో సమస్య ఉందా అని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.