English | Telugu

Krishna Mukunda Murari : ఆదర్శ్ అంటే ఇష్టం లేకున్నా ఎందుకు నటిస్తున్నావ్ మీరా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -470 లో.... ముకుందకు, ఆదర్శ్‌కు పెళ్లి చెయ్యాలనుకుంటున్నా అని రేవతి, కృష్ణలతో భవాని అంటుంది. దాంతో వద్దు అత్తయ్యా అంటూ కృష్ణ కంగారుగా చెబుతుంది. ఏం అయ్యింది తింగరి.. ఎందుకు వద్దు.. నీ మనసులో ఏముందని భవాని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్యా.. మీరా అంటే మన ఆదర్శ్‌కి ఇష్టముందని తెలిసింది కానీ... మీరా మనసులో ఏముందో తెలియదు కదా.. గతంలో ముకుంద విషయంలో కూడా అదే తప్పు జరిగింది కదా.. ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని.. అందుకే పెద్దత్తయ్యా వద్దన్నాను అని కృష్ణ అంటుంది.

ఏం ఆలోచించక్కర్లేదు. ఆదర్శ్ అంటే ఇష్టం లేకుండా ఆ మీరా ఆదర్శ్ వెనుకే తిరగదు కదా.. నువ్వేం కంగారుపడకు తింగరి.. వాళ్ల కళ్లల్లో ఎప్పుడెప్పుడు పెళ్లి చేస్తారా అనే ఉంది. నేను గమనించాను.. రేవతీ పంతుల్ని పిలిపించు.. పెళ్లి మూహూర్తం పెట్టిద్దామని భవాని అంటుంది. దాంతో కృష్ణ కంగారు మురారి దగ్గరకు వెళ్లి.. జరిగింది మొత్తం చెబుతుంది. దాంతో మురారి కూడా కంగారుపడతాడు. మళ్లీ మురారీకి‌ కృష్ణ ధైర్యం చెప్పి.. ఇద్దరం కలిసి ఈ సమస్య నుంచి ఎలాగో బయటపడదామని అంటుంది.

మరోవైపు ఆదర్శ్ మోకాళ్ల మీద కూర్చుని మీరాకు ఓ గిఫ్ట్ ఇస్తాడు. దాన్ని ఓపెన్ చెయ్యమని సంగీత ఒత్తిడి తేవడంతో మీరా ఓపెన్ చేస్తుంది. ఆ గిఫ్ట్ లవ్ సింబల్ కావడంతో.. మీరా కావాలనే సిగ్గుపడుతూ ఇష్టమే అన్నట్లుగా చూస్తుంది. అది చూసిన మురారీ, కృష్ణ షాక్ అవుతారు. ఈ రోజు మీరా పుట్టినరోజు కాబట్టే గిఫ్ట్ ఇచ్చాను. మరి నువ్వు మీరాకు ఏం గిఫ్ట్ ఇస్తావ్ పెద్దమ్మా అని ఆదర్శ్ అనగానే.. నిన్నే గిఫ్ట్‌గా ఇద్దాం అనుకుంటున్నా ఆదర్శ్ అని భవాని అంటుంది. మీరా సిగ్గుపడుతుంది. ఆదర్శ్ పొంగిపోతాడు. ఇక అది చూసి మురారీ, కృష్ణ ఇద్దరు మరింత షాక్ అవుతారు. వెంటనే మీరాను రెస్టారెంట్‌కి రమ్మని చెప్పి.. మురారి, కృష్ణ ఇద్దరు రెస్టారెంట్‌ లో వెయిట్ చేస్తుంటారు. అక్కడికి వెళ్లిన మీరా తన నటన మొదలెడతుంది. బిడ్డ కోసం తను తీసుకుంటున్న జాగ్రత్తల గురించి మాట్లాడుతుంది. దాంతో మురారీ, కృష్ణలు తిట్టేస్తారు. నీ ఉద్దేశమేంటి? ఆదర్శ్‌లో ఎందుకు ఆశలు రేపుతున్నావంటు అడుగుతారు. ఇక మీరా మొత్తం మురారీ, కృష్ణలదే తప్పు అన్నట్లు మాట్లాడుతుంది. దాంతో కృష్ణ కోపంగా.. అసలు నువ్వు ఎందుకు ఆదర్శ్ అంటే ఇష్టం ఉన్నట్లుగా నాటకం ఆడుతున్నావని అడుగుతుంది.

చూడు కృష్ణా.. నీ గర్భం పోయింది. గొడ్రాలివి అని తెలియకుండా ఇంట్లో బ్రహ్మాండంగా నాటకం ఆడుతున్నావంటూ మీరా ఏదో అనబోతుంటే.. మురారీకి కోపం వచ్చేసి.. మీరా అని అరుస్తాడు. అయ్యో తప్పుగా అనుకోకండి మురారీ గారు.. జరిగిందే చెబుతున్నాను.. ఏ మాత్రం ఇష్టంలేనట్లుగా ప్రవర్తించినా నిలదీస్తారు.. కారణం ఏంటని అడుగుతారు. ఎంత తప్పించుకోవాలని చూసిన నిజం బయటపడిపోతుంది. అందుకే నీ అంత కాకపోయినా ఆల్ మోస్ట్ అదే రేంజ్‌లో నటిస్తున్నాను కృష్ణా అని మీరా అంటుంది. సమస్యను దూరం చేయడానికి నటించాలి కానీ దగ్గర చేయడానికి కాదు మీరా.. నువ్వు చేసే ప్రతీ పని పెళ్లికి దగ్గరయ్యేలా చేస్తోందని కృష్ణ అనడంతో.. అప్పుడు ఆ పెళ్లిని ఆపండి అని మీరా అంటుంది. తరువాయి భాగంలో.. పంతులు వచ్చి.. వచ్చే శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉందని భవానీతో అంటాడు. ఇక కృష్ణ, మురారి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.