English | Telugu
Krishna Mukunda Murari:స్కెచ్ ఆర్టిస్ట్ ని బ్లాక్ మెయిల్ చేశాడు.. దేవ్ మాస్టర్ ప్లాన్ సక్సెస్!
Updated : Jan 1, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -355 లో... కృష్ణ, మురారి ఇద్దరు కలిసి భవాని పక్కన కూర్చొని భోజనం చెయ్యాలని ప్లాన్ చేస్తారు. అ తర్వాత కృష్ణ, మురారి కలిసి అనుకున్నట్లుగానే భవాని పక్కన కూర్చుని భోజనం చేస్తుండగా.. ముకుంద కావాలనే భవానిని రెచ్చగొడుతుంది. దాంతో కృష్ణ తన పక్కన కూర్చున్నందుకు భవాని కోప్పడుతుంటే.. మీరు ఒకరి మాటలు విని ఇలా మాట్లాడడం ఎప్పుడు చూడలేదని మురారి అంటాడు. దాంతో భవాని సైలెంట్ గా ఉంటుంది.
అ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తారు. భవానికి కృష్ణ వాటర్ ఇస్తుంటుంది. అయిన కృష్ణని భవాని దూరం పెడుతుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరకి మురారి వస్తాడు. ఏదో టెన్షన్ గా ఉందని కృష్ణ అనగానే.. టెన్షన్ ఎందుకు కేసు ఒక కొలిక్కి వస్తుంది కదా పరిమళతో పాటు స్కెచ్ వేసే అతను వస్తే సరిపోతుందని మురారి అంటాడు. స్కెచ్ లో ఉన్న అతను మనకి తెలిసినతను కావాలి లేదంటే అదొక ప్రాబ్లమ్ అని కృష్ణ అంటుంది. నువ్వు ఏమి టెన్షన్ పడకని కృష్ణకి మురారి చెప్తాడు. మరొకవైపు స్కెచ్ వేసే అతను వస్తే ఎక్కడ దేవ్ ఫోటో వేస్తాడో అని ముకుంద టెన్షన్ పడుతు దేవ్ ని టెన్షన్ పెడుతుంది. నువ్వు టెన్షన్ పడుతు నన్ను టెన్షన్ పెట్టకు ఇక్కడ నుండి వెళ్ళు ఎవరైన వింటే ప్రాబ్లమ్ అవుతుందని దేవ్ అంటాడు. అందరు హాల్లో పరిమళ, శ్రీధర్ కోసం వెయిట్ చేస్తుంటే దేవ్ వచ్చి.. ఇంకా స్కెచ్ ఆర్టిస్ట్ రాలేదా అని అడుగుతాడు. ఆ తర్వాత ఎవరికి డౌట్ రాకుండా వాళ్ళు రాగానే గదిలోకి దేవ్ వెళ్లిపోతాడు.
పరిమళ సర్జరీ చేయించిన అతను ఎలా ఉంటాడని చెప్తుంటే శ్రీధర్ బొమ్మ గీస్తూ ఉంటాడు. అందరు టెన్షన్ గా వెయిట్ చేస్తుంటారు. ఆ తర్వాత స్కెచ్ గీయడం పూర్తి అవుతుంది. ఆ స్కెచ్ లో ఉన్న బొమ్మ చూసి అందరు షాక్ అవుతారు. అతను భవానికి తెలిసిన వ్యక్తి పైగా మూగవాడు. ఆ బొమ్మని చూసి అ రోజు సర్జరీ చేయించింది ఇతను కాదని పరిమళ అంటుంది. మీరు సరిగ్గ వెయ్యలేదని శ్రీధర్ ని పరిమళ అనగానే.. లేదు మీరు చెప్పినట్టే గేసానని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత కృష్ణని తప్పించాలని మురారి ఇదంతా చేసాడని భవాని అంటుంది. ఆ తర్వాత ముకుందకి దేవ్ తన ప్లాన్ చెప్తాడు. ముందే శ్రీధర్ దగ్గరకి వెళ్లి బ్లాక్ మెయిల్ చేసి వేరే అతని బొమ్మ వెయ్యమని చెప్పానని ముకుందతో దేవ్ అనగానే సూపర్ ఐడియా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో.. దేవ్ తలకు గాయంతో భవాని దగ్గరకి వస్తాడు. ఏమైందని అడుగుతారు శ్రీధర్ ని తీసుకొని రావడానికి వెళ్ళాను. అక్కడ శ్రీధర్ ని చంపేశారని దేవ్ అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.