English | Telugu
కిరణ్మయి మొదటి వ్లాగ్ లో బ్రహ్మముడి సీరియల్ డైరెక్టర్!
Updated : Jun 23, 2023
డైరెక్టర్ కుమార్ పంతం.. బ్రహ్మముడి సీరియల్ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అంతకముందు గుప్పెడంత మనసు సీరియల్ తో పేరు తెచ్చుకున్నాడు. కాగా ఇప్పుడు స్టార్ మా టీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నింటిలో టాప్ -5 లో ఈ రెండు సీరియల్స్ ఉండటం విశేషం.
కుమార్ పంతం.. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఎంచుకున్నాడు. బ్రహ్మముడి సీరియల్ లో ప్రతీ పాత్రకి ఒక్కో ఇంపార్టెన్స్ ఇస్తూ కథని ఆసక్తికరంగా మలిచాడు. ఈ కథలో కావ్య పాత్రకి సింప్లిసిటిని అద్ది, బాగా డబ్బున్న కుటుంబంగా దుగ్గిరాల ఫ్యామిలీని వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాడు. స్వప్న పాత్రలో హమీదా, కావ్యగా దీపిక రంగరాజు, అపర్ణగా శ్రీప్రియ, రాజ్ గా మానస్, కళ్యాణ్ గా కిరణ్, కనకంగా నీపా, రుద్రాణి పాత్రలో షర్మిత గౌడ.. ఇలా అందరూ తమ ఇన్ స్టాగ్రామ్ , యూట్యూబ్ లలో ట్రెండింగ్ లో ఉన్నవాళ్ళే.. ఇలా అందరికీ ఫ్యాన్ బేస్ ఉంది. చింటు పంతం రాసిన ఈ కథ ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సీరియల్ ముందు వరకు ఎవరికి అంతగా తెలియని డైరెక్టర్ చింటు పంతం.. బుల్లితెరపై ఈ సీరియల్ ని ఆరాధించే అభిమానుల వల్ల అందరికి తెలిసిపోయాడు. అతను ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేసిన మంచి స్పందన లభిస్తుంది.
ఇప్పుడు తాజాగా కుమార్ పంతం భార్య కిరణ్మయి కూడా పాపులర్ అయింది. జీ తెలుగులో ప్రసారమవుతున్న 'పడమటి సంధ్యారాగం' సీరియల్ లో హీరోకి తల్లిపాత్రలో చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా తను 'మీ కిరణ్మయి' అని సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితం 'ఫైనల్లీ నేనొచ్చేసా' అనే మూడు నిమిషాల వీడియోని అప్లోడ్ చేసి వెల్ కమ్ చెప్పిన కిరణ్మయి.. తన మొదటి వ్లాగ్ లో కుమార్ పంతంని ఇంటర్వూ చేసినట్టుగా స్టార్ట్ చేసింది. అందులో కుమార్ ని ప్రశ్నలు వేయగా అతను కొన్నింటికే సమాధానమిచ్చాడు. అయితే వ్లాగ్ సరదగా సాగింది. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.