English | Telugu

నాలోని వేడి సూర్యుడికంటే ఎక్కువ : కిరణ్ రాథోడ్!

నాలోని వేడి సూర్యుడికంటే ఎక్కువ.. ఒప్పుకుంటారో లేదో.. చూసి మీరే కామెంట్ చేయండి అంటూ కొన్ని బోల్డ్ ఫొటోలు అప్లోడ్ చేసింది బిగ్ బాస్ కిరణ్ రాథోడ్. సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ అండ్ బోల్డ్ ఫోటోలతో రీల్స్ తో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న వారిలో ఇప్పుడు కిరణ్ రాథోడ్ చేరింది. బిగ్ బాస్ సీజన్-7 లో ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్ కిరణ్ రాథోడ్. బిగ్ బాస్ సీజన్-7 లోకి పన్నెండవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. అయితే తనకి తెలుగు రాదు. ఇదే తను ఎలిమినేట్ అవడానికి ప్రధాన కారణంగా మిగిలింది. ఎందుకంటే హౌజ్ లో అందరితో కలవడానికి భాష కావాలి. తను మాత్రం హిందీ, ఇంగ్లీష్ లోనే మాట్లాడేది‌. దాంతో తోటి కంటెస్టెంట్స్ కి ఇబ్బందిగా మారింది.

కిరణ్ రాథోడ్ రాజస్థాన్ లో జన్మించింది. తనకి మాడలింగ్ మీద ఇంట్రెస్ట్ తో డిగ్రీ పూర్తయ్యాక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో అల్లరి నరేష్ నటించిన 'కెవ్వు కేక' సినిమాలో కిరణ్ రాథోడ్ చేసింది. తను ఎక్కువగా తమిళంలో సినిమాలు చేసింది‌. అయితే తెలుగులో నువ్వు లేక నేను లేను సినిమాలో అరంగేట్రం చేసింది. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, ఉన్నత పాఠశాల, అందరు దొంగలే దొరికితే, చెప్పవే చిరుగాలి, నాని మొదలైన తెలుగు సినిమాల్లో చేసి క్రేజ్ సంపాదించుకుంది కిరణ్ రాథోడ్. మిధునరాశి సినిమాకి గాను ఉత్తమ నూతన ముఖ నటిగా తనకి అవార్డు కూడా వచ్చింది. బాలివుడ్ నటి రవీనా టండన్ కి కిరణ్ కజిన్ అని కొంతమందికే తెలుసు. అయితే ఎప్పుడు తను ఇన్ స్టాగ్రామ్ లో హాట్ అండ్ బోల్డ్ ఫోటోలతో ఎప్పుడు‌ ట్రెండింగ్ లో ఉంటుంది.

కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ లో నటిగా గ్లామర్ రోల్ ని చేయడంలో సక్సెస్ అయింది‌. అయితే తనకి కెమరా స్పేస్ తక్కువే దొరికింది. హోస్ట్ నాగార్జున తనకి తెలుగు నేర్చుకోమని చెప్పిన తను పట్టించుకోకపోవడం, ఒకరు ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే కలిసి మాట్లాడటంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు కిరణ్ రాథోడ్ అసలు హౌజ్ లో ఉందా అనే డౌట్ ఏర్పడింది. కాగా తనని తాను నిరూపించుకోవాడికి సమయం ఇవ్వలేదని పలువురు విమర్శకులు విమర్శిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్-7 లో ఎంట్రీ కిరణ్ రాథోడ్ కి కమ్ బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.