English | Telugu

Eto Vellipoyindhi Manasu:చెల్లి ప్రేమను తెలుసుకున్న అన్నయ్య.. రామలక్ష్మి అభిప్రాయం మారిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-19 లో... ధన ఇంటికి వచ్చిన శ్రీలత అన్న మాటలని అతను గుర్తుకుచేసుకుంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. ఏమైంది ఈ దెబ్బలేంటని అడుగుతుంది. రామలక్ష్మికి చెప్పడమే బెటర్.. ఏదైనా సజెషన్ ఇస్తుందని ధన అనుకొని.. నా ఫ్రెండ్ కి నాకు గొడవ అయింది. మళ్ళీ కలవాలా వద్దా అని అడుగుతాడు.

కలవకు ఎందుకంటే నువ్వు చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నావ్.. అది గుర్తుపెట్టుకో. మా ఆశలన్నీ నీపై ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నాయి బాగా చదువుకోమని రామలక్ష్మి చెప్తుంది. అది ఫ్రెండ్ అయిన లవ్ అయిన వదులుకోమని తన తమ్ముడికి రామలక్ష్మి చెప్తుంది. ఇంకా నయం డైరెక్ట్ నా లవ్ గురించి చెప్పలేదని ధన తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీలత, సందీప్ కలిసి సిరి, ధనతో క్లోజ్ గా ఉన్న సంఘటన గుర్తుకుచేసుకొని కోపంగా ఉంటారు. అప్పుడే సీతకాంత్ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఏం లేదని చెప్పిన కూడా సీతాకాంత్ కి డౌట్ వస్తుంది. సీతాకాంత్ కి శ్రీవల్లి ఎదురుపడి తడబడుతుంది. దాంతో సీతాకాంత్ కి ఇంకా డౌట్ వస్తుంది. కాసేపటికి నేను ఇది దాచలేనని అంటూ అటు ఇటు తిరుగుతుఙటుంది‌. అప్పుడే సీతాకాంత్ వచ్చి ఏమైందని అడుగుతాడు. దాంతో శ్రీవల్లి నిజం చెప్తుంది. మీ చెల్లి ఎవరో బస్తీ కుర్రాడిని లవ్ చేస్తుందంట అని అనగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ధనకి సిరి ఎన్నిసార్లు ఫోన్ చేసిన కట్ చేస్తూనే ఉంటాడు. దాంతో సిరి బాధపడటం సీతాకాంత్ చూస్తాడు. మరొకవైపు ధన బాధపడటం రామలక్ష్మి చూస్తుంది.

మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి, పింకీ ఇద్దరు గుడికి వెళ్తారు. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కూడా అదే గుడికి వస్తారు. అప్పుడే స్టూడెంట్స్ కి మీరే కదా సర్ ఫీ కట్టారంటు ఒక ఆవిడ వచ్చి థాంక్స్ చెప్తుంది. ఆవిడ మళ్ళీ రామలక్ష్మిని కలిసినప్పుడు ఇతనే మీకు ఆ రోజు ఫీ కట్టిందంటు సీతకాంత్ ను చూపిస్తుంది. దాంతో రామలక్ష్మికి సీతాకాంత్ పై మంచి అభిప్రాయం వస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మయి కష్టాల్లో ఉంది జాబ్ ఇవ్వాలని అన్నావ్ కదా అని వాళ్ళ తాతయ్య అనగానే.. సీతాకాంత్ వెళ్లి రామలక్ష్మితో మాట్లాడి.. మీకు జాబ్ ఇస్తున్నాను‌. అది మీ ఇష్టమని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి జాబ్ చెయ్యడానికి సీతాకాంత్ ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.