English | Telugu

నిజం తెలుసుకోవడానికే వాళ్ళింటికి వెళ్ళానని చెప్పిన రాజ్.. రాహుల్ దొరికిపోయాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-77లో.. కనకం-కృష్ణమూర్తిల ఇంటి నుండి దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజ్, కావ్యలని ఇంటి గుమ్మం దగ్గరే ఆపేస్తుంది రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఇంట్లోకి వచ్చే అధికారం లేదని అపర్ణ చెప్తుంది. ఏ అమ్మ ఎందుకు లోపలికి రాకూడదని రాజ్ అడుగగా.. నువ్వు నా మాట కాదన్నావ్? వాళ్ళింటి నుండి రమ్మంటే రానన్నావ్ అని అపర్ణ అంటుంది. దానికి కారణం ఉంది.‌. కావ్య తప్పేం లేదని రాజ్ అంటాడు. దాంతో రాజ్ వాళ్ళ నానమ్మ ఇందిరాదేవీ.. చూసావా అపర్ణ.‌. తన తప్పేం లేదని నీ కొడుకే చెప్తున్నాడు కదా అని అంటుంది. అది విని "చూసారా..‌ నా కొడుకు నా మాట వినట్లేదు.‌. పెళ్ళికి ముందు ఒకలా ఉన్నాడు.. పెళ్ళి తర్వాత ఒకలా ఉన్నాడు. అంతా కావ్య వల్లే.. తనని వదిలేసి వస్తేనే.. నన్ను అమ్మా అని పిలువు.‌. లేదంటే ఆ బంధమే లేదనుకో" అని రాజ్ తో అపర్ణ అంటుంది. అది విని రాజ్ వాళ్ళ నానమ్మ ఇందిరాదేవీ.. ఏంటి అపర్ణ ఏం మాట్లాడుతున్నావ్? నీ కోపంతో నీ కొడుకి కాపురాన్ని కూల్చేస్తావా అని అనగా.. పక్కనే ఉన్న ఇంద్రాణి.. ఏంటి వదిన.. రాజ్ తన భర్యని అర్థం చేసుకొని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళాడు. దానికే వారిద్దరిని విడదీస్తావా? నాలాగే వాళ్ళ జీవితం పాడుచేస్తావా అని అంటుంది. పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి.‌. అక్క నువ్వు నన్ను తిట్టు.. నీకా అధికారం ఉంది. కానీ భార్యాభర్తలను విడిపోమని చెప్పకు.. ఒక కోడలిగా కాకుండా, ఒక అత్తగా కాకుండా.. రాజ్ కి తల్లిగా ఆలోచించి చూడు.. నీ కొడుకి జీవితాన్ని నువ్వే ముక్కలు చేస్తావా అక్క అని రేవతితో అంటుంది.

ఆ తర్వాత ఇంటికి పెద్ద అయిన సీతారామయ్య మాట్లాడతాడు. ఈ ఇంట్లో నా కోడలు అపర్ణ మాకు సంకెళ్ళు వేసింది రాజ్..‌ ఇప్పుడు వివేకంతో విచక్షణతో నువ్వే ఒక నిర్ణయం తీసుకోమని రాజ్ తో సీతారామయ్య చెప్తాడు. కాసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్ళమని కావ్యకి రాజ్ చెప్తాడు. దాంతో అందరూ సంతోషిస్తారు. అపర్ణ కోపంతో వెళ్ళిపోతుండగా తనని చూసిన కావ్య.. ఒక్క నిమిషం.. నేను లోపలికి రానని కావ్య అంటుంది. ఎందుకు ఇప్పుడు నిన్ను బ్రతిమాలుకోవాలా అని కావ్యని రాజ్ అడుగగా.. నన్ను కాదు మీ అమ్మని బ్రతిమాలుకో అని కావ్య అంటుంది‌. ఆ తర్వాత రాజ్ నానమ్మ వచ్చి కావ్యని లోపలికి రమ్మని గట్టిగా చెప్పగా లోపలికి రాజ్, కావ్యలు ఇద్దరు వస్తారు.

కనకం వాళ్ళింట్లో ఉన్న స్వప్న ఎవరూ లేని చోటులో ఒక పక్కగా వచ్చి రాహుల్ కి కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు చేసిన రాహుల్ లిఫ్ట్ చేయడు. స్వప్న ఎవరికో కాల్ చేయడం అప్పు చూసేస్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో తన గదిలో బాధపడుతున్న అపర్ణ దగ్గరికి రాజ్ వస్తాడు. నాతో మాట్లాడవా అమ్మా అని రాజ్ అడుగగా.. నన్ను అలా పిలవకని అపర్ణ అంటుంది. ఇదంతా నేనంటో తెలుసనే ధీమాతోనే చేసానని రాజ్ అనగా.. నేనొచ్చొ మనింటికి రమ్మని పిలిచినా రాలేదు.. ఇంట్లో నీ భార్యని వదిలేసి రావొచ్చుగా అని అపర్ణ అంటుంది. అదంతా నటన.. అబద్దం.. ఆ స్వప్న వాళ్ళింట్లో‌ ఉందనే అనుమానంతో వెళ్ళాను.‌. అందుకే రాలేదని రాజ్ చెప్తాడు. అంటే నీ భార్య అందరిని మోసం చేసిందనంటావా అని అపర్ణ అనగా.. అవునని రాజ్ అంటాడు. అదంతా కళ్యాణ్ వింటాడు. అంతలోనే రాహుల్ కి స్వప్న కాల్ చేస్తుంది‌. స్వప్న రాహుల్ తో మాట్లాడేదంతా చాటుగా కిటికీలో నుండి అప్పు వీడియో రికార్డ్ చేస్తుంది. నిన్ను తీసుకెళ్ళింది నేనే అని కావ్యకి అర్థమైంది.. ఆవేశపడకు స్వప్న అని రాహుల్ అనగా.. పక్కనే కావ్య ఉంటుంది. వెంటనే కాల్ కట్ చేస్తాడు రాహుల్. కాల్ కట్ చేసారేంటి.. పర్వాలేదు మాట్లాడండని కావ్య అంటుంది. మా అక్కని తీసుకెళ్ళింది మీరేనని నాకు తెలుసు. మా అక్కని రౌడీల నుండి సేవ్ చేసినందుకు థాంక్స్.. రాజ్ కి మా అక్కకి ఎంగేజ్ మెంట్ రోజు హోటల్ కి తీసుకెళ్ళి హారం కొనిచ్చారు కదా దానికి థాంక్స్ అని కావ్య చెప్తూ ఉండగా రాహుల్ ఆశ్చర్యపోయి‌ చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.