English | Telugu

ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్న సామెతను నిజం చేసావ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్ మంద గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. నటుడుగా తెలుగు అభిమానులకు కౌశల్ సుపరిచితమే. అలా బిగ్‌బాస్ సెకండ్ సీజన్ విన్నర్ అయ్యేసరికి కౌశల్ ఫాలోయింగ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కౌశల్ ఆర్మీ పేరుతో సైన్యం కూడా తయారయ్యింది. కొంతమంది ఫ్యాన్స్ ఒక గ్రూప్‌గా ఉండి అతనికి క్రేజ్ తీసుకొచ్చారు అంటే ఆయన సత్తా ఏమిటో అర్ధమయ్యింది. అలాంటి కౌశల్ తన కో బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు.

" నా ప్రియమైన బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్..వరల్డ్ వైడ్ గా ఫేమస్ ఐన స్టార్స్ తో కలిసి ఆస్కార్ అవార్డ్స్ వేదిక మీద మెరవడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం. బిగ్ బాస్ టైటిల్ గెలిచేసాక ఇంకా వాళ్ళు ఏమీ చేయరులే అనుకునే వారికి మీ విజయం ఒక గుణపాఠం. వాళ్ళు అక్కడితో ఆగిపోరు అనుకున్నది చేసి చూపిస్తారు అని నిరూపించారు. తెలుగులో ఒక సామెత ఉంది " కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అని" దాన్ని ఈరోజు మీరు నిజం చేసి చూపించారు. నీకు ఇంత మంచి గుర్తింపు రావడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నీ సొంతం కావాళ్ళని ఇలాగే మరిన్ని అవార్డ్స్ అందుకోవాలని కోరుకుంటున్నా" అని తన మనసులో ఉన్న ఫీలింగ్ రాసుకున్నాడు.

కౌశల్ బిగ్ బాస్ తర్వాత బీబీ జోడీలో అభినయశ్రీతో కలిసిడాన్స్ పెర్ఫార్మెన్సులు చేసాడు. ఇక రాహుల్ సిప్లిగూంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్. అలాంటి రాహుల్ ఈరోజున సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’ పాడి ఆస్కార్ కోసం హిస్టరీ క్రియేట్ చేయడంలో ఒక భాగమయ్యాడు. ఇలా ఇప్పుడు రాహుల్ ఒక సెలబ్రిటీ ఐపోయాడు. గల్లీ స్థాయి నుంచి ఆస్కార్ వేదిక వరకు వెళ్లడం అంటే అంతా ఈజీ కాదు. దాని వెనక ఎంతో కష్టం ఉంది. ఇప్పుడు రాహుల్ కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చిందని అతని పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అతని ఫ్రెండ్స్ భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.