English | Telugu

Karthika Deepam 2 : కార్తిక్ మరదలిగా మోనిత.. కుబేరుడి కూతురిలా దీప!

ఇది కదా నవ వసంతం అంటే.. కార్తీకదీపం సీరియల్ రెండవ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ లోనే దర్శకుడు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. గొప్పింట్లో పెరగాల్సిన దీపని కష్టాల కడలిలో ముంచేస్తూ.. మోనితనని కార్తిక్ కి కాబోయే పెళ్ళామని తన పేరు జోత్స్న అని చెప్పి తన ఇంట్లోనే ఉండేలా చేయడంతో కథ ఆసక్తిగా మొదలైంది.

శివనారాయణ రెండో భార్యగా పారిజాతం ఉంటుంది. తన కొడుకుని శివనారాయాణ తక్కువ చేయడంతో రగిలిపోయిన పారిజాతం తన కోడలు కళ్యాణి ప్రసవించిన పాపని సుమిత్రకి పుట్టిన పాప స్థానంలో లో ఉంచి, సుమిత్ర కి పుట్టిన పాపని తోసుకొని సైదులు అనే తన మనిషికి ఇచ్చి పంపిస్తుంది. శివానారాయాణల కొడుకు దశరథ్, కోడలు సుమిత్ర. ఇక వీరిద్దరి కూతురుగా పారిజాతం మనవరాలు పెరుగుతుంది. ఇక అదే సమయంలో సైదులు చేతిలో ఉన్న దశరథ్-సుమిత్రల పాపని చంపేయమని పారిజాతం చెప్పగా.. అతనికి చంపడానికి ధైర్యం రాక ఓ బస్ స్టాప్ లో వస్తాడు. అప్పుడే అక్కడికి కుబేరుడు అనే వ్యక్తి వస్తాడు. ఆ పాపని చూసి జాలిపడి దేవుడిచ్చిన వరమని ఇంటికి తీసుకెళ్తాడు. ఇక తన అమ్మ పారిజాతం చేసిన పనికి సాక్ష్యంగా తన కన్నకొడుకు దాసు ఉంటాడు. పారిజాతం ఎక్కడ దశరథ్-సుమిత్రల పాపని చంపేస్తుందోనని దాసు ఈ విషయాన్ని ఎవరితో చెప్పడు.

ఇక తర్వాత రోజున గొప్పింట్లో కార్తీక కి కాబోయే భార్యగా దశరథ్-సుమిత్రల కూతురికి బారసాల జరుగుతుంది. శివనారాయాణ తన మనవరాలికి జ్యోత్స్న అనే పేరు పెట్టమని తన కొడుకు దశరథ్ కి చెప్పడంతో పాపకి అదే పేరుని పెడతాడు. ఇక అదే సమయంలో కుబేరుడు తీసుకొచ్చిన పాపకి దీప అనే నామకరణం చేస్తాడు. ఇక అన్నప్రసాన రోజున దీప ముందు పుస్తకాలు, డబ్బు, ఇలా అన్నీ పెట్టిన కుబేరుడు.. పుస్తకాలు ముట్టుకోవమ్మ బాగా చదివి కలెక్టర్ కావాలమ్మ అని ఆడపడుతుంటాడు. కానీ కుబేరుడు వాళ్ళ అక్కకి అది ఇష్టం లేక ఓ గరిట తీసుకొచ్చి పాప(దీప) ముందు వేయడంతో అదే పట్టుకుంటుంది‌. నువ్వు కలెక్టర్ అవ్వాలనుకుంటే తను వంటలక్క అవుతుందని వాళ్ళ అక్క కుబేరుడుతో చెప్తుంది. దాంతో కుబేరుడు చాలా బాధపడుతుంటాడు. ఇక అదే సమయంలో గొప్పింట్లో ఉన్న జ్యోత్స్న బారసాల రోజున.. అన్ని వస్తువులని చూస్తు ముందుకొస్తుంటే ఫోటోలు తీస్తారు. ఇక ఫోటోలలో‌ బాగా కనపడాలని పారిజాతం లిప్ స్టిక్ పెట్టుకుంటుంది. అది చూసిన శివనారాయాణ.. పారిజాతం గట్టిగ అరుస్తాడు. దాంతో తన చేతిలో ఉన్న లిప్ స్టిక్ ని పారిజాతం కింద పడేస్తుంది. ఇక అదే సమయంలో జ్యోత్స్న ఆ లిప్ స్టిక్ ని పట్టుకుంటుంది. అది చూసిన శివనారాయాణ కోపంతో దశరథ్ ని పిలిచి పాప జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు తన మనవరాలు తను అనుకున్నట్టుగానే అవ్వాలని పారిజాతం కలలు కంటుంది. ఇలా గొప్పింట్లో జ్యోత్స్న, పేదింట్లో దీప పెరుగుంతుంటారు. నెలలు, సంవత్సరాలు దాటిన కొంతకాలం తర్వాత కుబేరుడికి కూతురిగా దీప ఉంటుంది‌. మరి కాలం మార్చిన దీప జాతకాన్ని తను సరిదిద్దుకోగలదా? పారిజాతం చేసిన మోసానికి శిక్ష పడనుందా? కార్తీక్ కి కాబోయే భార్యగా పారిజాతం మనవారలైన జ్యోత్స్న ని అంటున్నవారికి‌‌ అసలు నిజం తెలిసేనా? దీప, కార్తీక్ లు ఒక్కటయ్యేనా తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.