English | Telugu

Brahmamudi : పడలేదా ఓ బ్రహ్మముడి.. ఆ జంట ఇరుదారులకి !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -366 లో... రాజ్ తీసుకొచ్చిన బాబుకి కావ్య పాలు తీసుకొని వెళ్తుంటే.. నా మాటకే ఎదరు తిరుగుతావా అంటూ కావ్యపై అపర్ణ కోప్పడుతుంది. తప్పు చేసింది మీ కొడుకు.. అది తెలుసుకోకుండా మీ కోపం పసిబిడ్డ పైన చూపిస్తానంటే నేను ఒప్పుకోనని కావ్య అనగానే అప్పుడే ఇందిరాదేవి వచ్చి బాగా మాట్లాడావంటూ కావ్యని సపోర్ట్ చేస్తుంది.

కావ్య ఆలోచన విధానం సరైనది అలా ఎవరు అలోచించలేరు. నువ్వు ఏం చేసిన నీకు సపోర్ట్ గా ఈ ఇంట్లో నేనుంటాను నువ్వు వెళ్ళు కావ్య అని ఇందిరాదేవి అంటుంది. నీకు మనవడు వచ్చాడేమో గాని నీకు విలువ లేకుండా అయిపోయిందని అపర్ణతో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత బాబుకు పాలు పట్టమని రాజ్ కి కావ్య పాల డబ్బా ఇస్తుంది. థాంక్స్ అంటూ రాజ్ చెప్తాడు.. కావ్య తన బాధని చెప్పుకొని ప్రయత్నం చేస్తుంది. ఇకనుండి నిన్ను బాధపెట్టను.. నా వల్ల‌ ఇక నీకు ఇబ్బంది ఉండదని రాజ్ అంటాడు. ఆ తర్వాత విడాకుల పత్రాలపై నువ్వు సంతకం చేసి ఇచ్చావ్.. నేను చేస్తున్నా అని రాజ్ సంతకం చేసి ఇస్తాడు. రమ్మనడం పొమ్మన్నడo అంత నీ ఇష్టమేనా.. ఈ బిడ్డకి తల్లి ఎవరు? ఆ తల్లి ఎలా అయింది? తల్లిని తీసుకొని రాకుండా కేవలం బిడ్డను మాత్రమే ఎందుకు తీసుకొని వచ్చారు.. ఈ ప్రశ్నలకి సమాధానం వచ్చేంతవరకు ఎక్కడకు వెళ్లను.. వెళ్ళమని చెప్పే అధికారం మీకు లేదని.. నిజలు బయటకు వచ్చాక ఉండాలో లేదో అప్పుడు నేను డిసైడ్ అవుతానని రాజ్ కి కావ్య చెప్తుంది.

మరొకవైపు బాబుని రాజ్ తీసుకొని వచ్చిన విషయం గురించి అనామిక తన అమ్మకు చెప్తుంటే.. అది విన్న అపర్ణ వచ్చి కోప్పడుతుంది. అప్పుడే రుద్రాణి, ధాన్యలక్ష్మిని తీసుకొని వస్తుంది. ఇంట్లో విషయం బయటకు చెప్పొద్దని తెలియదా అని అనామిక మీద అపర్ణ కోప్పడగానే.. అలా ఎందుకు చెప్పావంటు ధాన్యలక్ష్మి కూడా అనామిక మీద కోప్పడుతుంది. తరువాయి భాగంలో రాజ్ భోజనం దగ్గరకి వస్తే అపర్ణ వెళ్ళిపోవాలనుకుంటుంది. వద్దు నేనే వెళ్తానంటూ రాజ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజ్ కి కావ్య భోజనం తీసుకొని వెళ్తుంటే.. అపర్ణ వద్దని అంటుంది. ఇలా చేస్తే అయిన తన మనసులోని మాటలు బయటపెడుతారన్న చిన్న ఆశ అని అపర్ణతో కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.