English | Telugu
Karthika Deepam2 : శివన్నారాయణ బాధకి కారణం అదే.. దాస్ ని రిక్వెస్ట్ చేసిన జ్యోత్స్న!
Updated : Jul 29, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -421 లో... శివన్నారాయణ ఇంట్లో దాస్ భోజనం చేసి.. నాకు ఈ అవకాశం కల్పించినందుకు థాంక్స్ అని దాస్ అంటాడు. నీకు ఎప్పుడు రావాలనిపించనా నువ్వు మొహమాటాం లేకుండా రా అని శివన్నారాయణ చెప్పగానే పారిజాతంతో పాటు దాస్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఇక నేను వెళ్తానని అక్కడ నుండి దాస్ వెళ్తాడు. దాస్ కి గతం గుర్తు వచ్చింది కదా.. నా కూతురు ఎందుకు కొట్టిందో అడగాలని, దాస్ ని పిలిచి ఆగమని నిన్ను ఎవరు కొట్టారని దశరథ్ అడుగుతాడు దాస్ అప్పుడే నిజం చెప్పకని కార్తీక్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని నాకేం గుర్తు లేదు అన్నయ్య అంటాడు. అదంతా జ్యోత్స్న చూస్తుంటుంది. అప్పుడే దాస్ దగ్గరికి పారిజాతం వచ్చి అడగడం మర్చిపోయా.. నిన్ను ఎవరు కొట్టారని అడుగుతుంది. మర్చిపోయాను అమ్మ అని దాస్ చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే జ్యోత్స్న దాస్ వెనకాలే వెళ్లి అతనితో మాట్లాడుతుంది. నాన్న నా గురించి నువ్వు చెప్పాలనుకున్నా, చెప్పకుండా ఆగిపోమని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ఒకవేళ చెప్తే నేను ఉండనని బ్లాక్ మెయిల్ చేస్తుంది. చెప్పను కానీ అది నువ్వు తప్పు చెయ్యనంత వరకే అని జ్యోత్స్నతో అంటాడు దాస్.
ఆ తర్వాత శివన్నారాయణ తన భార్య తాళి బొట్టు పట్టుకొని బాధపడతాడు. అప్పుడే దీప వచ్చి అతను మంచివాడు కాదని తెలిసినప్పుడు జరగనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అని దీప అంటుంది. అప్పుడే జ్యోత్స్న కూడా వస్తుంది. ఇది నా భార్య తాళి.. జ్యోత్స్నకి కాబోయే వాడితో తన మెడలో ఇది కట్టించాలనుకున్న కానీ ఇలా జరిగిందని శివన్నారాయణ బాధపడుతాడు. మీరు అనుకున్నది జరుగుతుంది. మీరేం ఆలోచించకండి అని శివన్నారాయణతో చెప్తుంది దీప. అప్పుడే దశరథ్ వచ్చి దీప చెప్పింది నిజం అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.