English | Telugu

Karthika Deepam2 : కార్తీక్, దీపల మధ్య సంబంధమేంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -49 లో.. శౌర్యని కార్తిక్ స్కూల్ లో జాయిన్ చేస్తాడు. దాంతో శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతూ.. కార్తీక్ ని హగ్ చేసుకుంటుంది. ఇక శౌర్యని తీసుకొని కార్తీక్ బయటకు వస్తుంటే పారిజాతం చూస్తుంది. శౌర్యని కార్తీక్ ప్రేమగా తీసుకొని కార్ లో ఎక్కించుకొని వెళ్తుంటే..కార్తీక్ కి వాళ్లపై ఉన్నది జాలి కాదు బాధ్యత అని జ్యోత్స్నతో పారిజాతం చెప్తూ ఇంకా రెచ్చగొడుతుంది.

ఆ తర్వాత ఎక్కడికి వెళ్లి చెప్పాలో నాకు తెలుసని జ్యోత్స్న ని పారిజాతం తీసుకొని.. కాంచన దగ్గరికి వెళ్తుంది. మీరేదో చెప్పడానికే వచ్చారని అర్థమైంది.. ఏమైందని కాంచన అడుగుతుంది. దీప, బావల మధ్య సంబంధం ఏంటని జ్యోత్స్న అనగానే.. నా కొడుకు సాయం చేస్తున్నాడు. ఆ విషయం నాకు తెలుసని కాంచన అంటుంది. ఇంట్లో వాళ్లే ఇలా మాట్లాడితే బయటవాళ్ళు ఎలా మాట్లాడతారు. నా కోడలికి లేని పోనివి చెప్తున్నావని పారిజాతంపై కాంచన కోప్పడుతుంది. మరొకవైపు దీప శౌర్య కోసం ఐస్ క్రీమ్ తీసుకొని వస్తుంది. కానీ శౌర్య ఇంటి దగ్గర ఉండదు. సుమిత్ర దగ్గరికి వెళ్లి ఉంటుందని దీప ఇంట్లోకి వెళ్తుంటే.. పారిజాతం, జ్యోత్స్న ఎదరుపడతారు. జ్యోత్స్న చిరాకుగా లోపలికి వెళ్తుంది. నీకు నిజంగా శౌర్య ఎక్కడ ఉందో తెలియదా అని పారిజాతం అంటుంది. తెలియదని అనగానే నా చెవిలో ఏమైనా పువ్వులు కన్పిస్తున్నాయా అని పారిజాతం అంటుంది. శౌర్యని స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి పంపించి. ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావని పారిజాతం అనగానే దీప షాక్ అవుతుంది.

అప్పుడే శౌర్య, కార్తీక్ ఇద్దరు ఇంటికి వస్తారు. మీకు మీకు పర్సనల్ విషయాలు ఉంటాయి కదా అంటు పారిజాతం వెళ్ళిపోతుంది. దీప దగ్గరికి శౌర్య వెళ్లి.. కార్తీక్ నాకు నచ్చిన స్కూల్ లో జాయిన్ చేసాడని చెప్తుంది. మిమ్మల్ని ఎవరు తీసుకొని వెళ్లామన్నారని కార్తీక్ పై దీప కోప్పడతుంది. శౌర్య వెళ్ళిపోయాక.. మీ గురించి పట్టించుకోకని చెప్పినా సరే నేను పట్టించుకుంటానని కార్తీక్ అంటాడు. ఫీజు ఎంతో చెప్పండి నేను కడుతాను.. ప్రస్తుతం నా దగ్గర ఈ డబ్బులున్నాయని దీప అంటుంది. కార్తీక్ మొదట చెప్పడు.. ఆ తర్వాత ఏనభై వేలు అని అనగానే.. అంత డబ్బులు నేను ఎక్కడ నుండి తేగలనని దీప అనగానే.. నాతో రండి.. మీరు తీసుకొని రాగలరని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.