English | Telugu

Karthika Deepam2 : శౌర్య కోసం దీప తిప్పలు.. తన మాటలతో కంగుతిన్న కార్తిక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -46 లో.. నర్సింహా టాక్సీ నడుపుతూ.. ఒక స్కూల్ దగ్గరికి వస్తాడు. అదే స్కూల్ కి శౌర్యని దీప తీసుకొని వస్తుంది. నర్సింహా ఫోన్ మాట్లాడుతుంటే దీప అతన్ని చూస్తుంది. ఎక్కడ గొడవ చేస్తాడో అని దీప త్వరగా లోపలికి వెళ్తుంది. నర్సింహా దీపని చూస్తాడు కానీ నా ఉహేమో అని అనుకుంటాడు. ఆ తర్వాత దీప, శౌర్యని తీసుకొని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది.

దీప వాలకం చూసి ప్రిన్సిపల్ తనకే ఏదైనా జాబ్ కావాలని వచ్చిందేమోనని అనుకుంటాడు. ఇప్పట్లో ఆయాలు ఏం అవసరం లేదని ప్రిన్సిపల్ అంటాడు. అయ్యో నాకు జాబ్ కాదు సర్.. మా పాపని స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి వచ్చానని అనగానే మీరు చదువుకున్నారా అని అడుగుతాడు. మీవారు చదువుకున్నారా అని అడిగేసరికి దీప సైలెంట్ గా ఉంటుంది.. ఈ స్కూల్ లో జాయిన్ చేసుకోవాలి అంటే పిల్లల పేరెంట్స్ కూడా చదువుకొని ఉండాలని ప్రిన్సిపల్ అంటాడు. ఆ తర్వాత దీప డిస్సపాయింట్ అయి వెళ్తుంది. బయట స్కూల్ ముందు శౌర్య ఊయల ఊగుతూ.. నాకు ఈ స్కూల్ బాగా నచ్చిందని అంటుంది. స్కూల్ లో వద్దన్నారని దీప అనగానే.. అందుకే కార్తీక్ తీసుకొని వస్తే నన్ను స్కూల్ లో జాయిన్ చేసుకునే వారని శౌర్య అంటుంది. ఆ తర్వాత నర్సింహా టాక్సీ, కార్తీక్ కార్ రెండు ఎదురు ఎదురుగా వస్తాయి. నర్సింహా కోపంగా కార్ దిగి చూసేసరికి ఎదరుగా కార్తీక్. ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది.

ఆ తర్వాత దీప హోటల్ కి వచ్చి.. కస్టమర్ కి టిఫిన్ ఇస్తుంటుంది. స్కూల్ లో జాయిన్ చేసావా అని కడియం అంటాడు.. నేను చెప్పిన స్కూల్ లోనా జాయిన్ చేశావా అని కడియం అడుగగా.. లేదు వేరే స్కూల్ లో జాయిన్ చేశానని చెప్తుంది. ఆ స్కూల్ లో పిల్లలు చదవాలంటే పిల్లల పేరెంట్స్ కూడా చదువుకోవాలంట అనగానే.. మీ భర్త చదువుకోలేదా అని కడియం అంటాడు. కొన్ని కారణాల వల్ల నా భర్తకి నేను దూరంగా ఉన్నాను.. ఇంతకీ మించి నన్ను ఏం అడగకండి అని కడియంకి దీప చెప్తుంది. ఆ తర్వాత పారిజాతం అన్న మాటలు జ్యోత్స్న గుర్తుకుచేసుకుంటూ గ్లాస్ టేబుల్ పై పెడుతుంది‌. అది కిందపడిపోతుంటే కార్తీక్ వచ్చి.. గ్లాస్ ని పట్టుకుంటాడు. అలెర్ట్ గా ఉండాలి కదా అని కార్తీక్ అనగానే.. అలెర్ట్ గా లేకపోతేనే ఇంత దూరం వచ్చిందని జ్యోత్స్న అంటుంది. దాంతో సుమిత్ర, కార్తీక్ ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.