English | Telugu

Karthika Deepam2 : అతడిని ఫాలో చేస్తున్న కాశీ.. కార్తీక్ పై జ్యోత్స్నకి డౌట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -404 లో......గౌతమ్ కి కోపం వచ్చింది. నువ్వు వెళ్లి సారీ చెప్పమని జ్యోత్స్నతో దశరథ్ అంటాడు. సరే డాడ్ కలిసినప్పుడు చెప్తానని జ్యోత్స్న అనగానే.. వద్దు ఇప్పుడే ఇంటికి వెళ్లి చెప్పమని దశరత్ అంటాడు. సరేనని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్నతో పాటు కార్తీక్ కూడా వెళ్తాడు.

ఆ తర్వాత గౌతమ్ తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు కాశీ వీడియో తీస్తాడు. అందుకే జ్యోత్స్న అక్క ఫాలో అవ్వమని చెప్పందేమో ఈ విషయం వెంటనే వాళ్లకు చెప్పాలని కాశీ అనుకుంటాడు. ఒక దగ్గర జ్యోత్స్న కార్ ఆపమని చెప్పి బావ నీతో మాట్లాడాలి అంటుంది. నా గురించి నీకేమైనా నిజం తెలుసా అని అడుగుతుంది. ఎందుకు అలా అడిగావని కార్తీక్ అంటాడు.
గౌతమ్ ని నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని జ్యోత్స్న అనగానే.. చేసుకునేది నువ్వు నన్ను ఎందుకు అడగడం ఎందుకని కార్తీక్ అంటాడు. గౌతమ్ గురించి తెలుసా అని జ్యోత్స్న అనగానే నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసని కార్తీక్ అంటాడు. అసలు బావ బయటపడడం లేదని జ్యోత్స్న అనుకుంటుది.

ఆ తర్వాత గౌతమ్ ఇంటికి వెళ్తుంది జ్యోత్స్న. కార్తీక్ బయటే ఉండి వాళ్ళ మాటలు వింటుంటాడు. జ్యోత్స్న గౌతమ్ కి సారీ చెప్తుంది. జ్యోత్స్న చేతులు పట్టుకుంటాడు గౌతమ్. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. బావ కరెక్ట్ టైమ్ కి వచ్చాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. కార్తీక్ ఏదో ఒకటి మాట్లాడుతుంటే శివన్నారాయణ కోప్పడతాడు. జ్యోత్స్న ఏంటి అలా ఉందని దీప అడుగుతుంది. ఇంటికి వెళ్ళాక చెప్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.