English | Telugu

Karthika Deepam2 : కడియంకి అండగా దీప.. వారిద్దరిని అలా చూసి ఆమె షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -38 లో.. దీప తన అత్త చేసిన మోసాన్ని గుర్తుకుచేసుకొని బాధపడుతూ.. ఒక దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అప్పుడే ఒక పెద్దాయన పన్నెండవ నంబర్ బస్సు వెళ్ళిందా అంటూ దీపని అడుగుతాడు.. దీప బాధపడుతుంటే.. ఏమైంది అమ్మ అంటూ అడుగుతాడు. నీ కళ్ళలో వచ్చే కన్నీళ్లు చూసి నువ్వు బాధలో ఉన్నావని అర్థం అయిందని ఆ పెద్దాయన అంటాడు.

ఆ తర్వాత నీ మాటల్లో తెలుస్తుంది.. నువ్వు కష్టాల్లో ఉన్నావని.. పెద్దయ్య నీ కష్టమేంటి చెప్పమని దీప అడుగుతుంది. నా పేరు కడియం. నాకు చిన్న హోటల్ ఉండేది. కరోన వల్ల లాక్ డౌన్ తర్వాత నా హోటల్ కి కస్టమర్ తక్కువయ్యారు. ఇప్పుడు నా హోటల్ ని మూసేసి ఇంటికి వెళ్తున్న అంటు బాధగా చెప్తుంటే.. నేను మీకు సాయం చేస్తాను కడియం పెద్దయ్య.. నాకు వంటలు వచ్చని దీప అంటుంది. ఇప్పుడు వెళ్లి మీరు మూసేసిన హోటల్ ని ఓపెన్ చేద్దామని దీప చెప్పగానే.. కడియం సరే అంటాడు. మరొకవైపు శౌర్యతో కార్తిక్ ఆడుకుంటుంటే.. అప్పుడే అక్కడికి పారిజాతం, జ్యోత్స్న వస్తారు. చాక్లెట్ లా నువ్వు పక్కన ఉంటే కార్తీక్ ఆ పిల్లతో ఆడుతున్నాడు. నువ్వు కార్తీక్ ని బయటకు తీసుకొని వెళ్ళు.. ఆ పిల్ల సంగతి నేను చూస్తానని జ్యోత్స్నతో పారిజాతం చెప్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న కార్తీక్ దగ్గరకి వచ్చి బయటకు వెళదాం.. నాకు డ్రైవింగ్ చేయాలంటే భయంగా ఉందని జ్యోత్స్న అనగానే కార్తీక్ బయటకు తీసుకొని వెళ్తాడు.

ఆ తర్వాత దీప, కడియం ఇద్దరు హోటల్ తెరుస్తారు. దీప టీ రెడీ చేస్తుంది. మరొకవైపు ఎక్కడికి వెళదాం.. రెస్టారెంట్ లకి, కాఫీ షాప్ లకు వెళ్ళేకంటే రోడ్ సైడ్ షాప్స్ లో టీ, కాఫీ లు బాగుంటాయని కార్తీక్ ఒక దగ్గర కారు ఆపుతాడు. నేను రాను నువు వెళ్ళమని జ్యోత్స్న అంటుంది.. తీరా కార్తీక్ వెళ్ళింది దీప, కడియంల దగ్గరికి.. అక్కడ దీపని చూసి కార్తీక్ షాక్ అవుతాడు.. ఒక టీ తాగుతాడు. చిల్లర లేదని దీప అంటుంది. ఇక నుండి ఇక్కడే రోజు టీ తాగుతానని కార్తీక్ అంటాడు. దీపతో కార్తిక్ మాట్లాడడం జ్యోత్స్న చూసి.. అందుకేనా ఇక్కడ టీ తాగుదాం అన్నావని అనుకుంటుంది. ఆ తర్వాత ఇంటి దగ్గర శౌర్య వెయిట్ చేస్తుంది. వెళదాం రండి అని కార్తీక్ అంటాడు. దాంతో దీప కూడా సరే అనగానే.. అలా కారు దగ్గరికి ఇద్దరు వస్తారు. వచ్చేసరికి జ్యోత్స్న ఉండదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.