English | Telugu

మోనిత పాత్రను ప్రవేశపెట్టాలని కోరుతున్న కార్తీకదీపం ఫాన్స్!

బుల్లితెర మీద ప్రసారమయ్యే "కార్తీక దీపం" సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో కార్తిక్, దీప, మోనిత ఈ ముగ్గురు బాగా ఫేమస్ ఐన క్యారెక్టర్స్.. కార్తీకదీపంలో మోనిత క్యారక్టర్ లో నటిస్తున్న శోభా శెట్టి ఈ మొత్తం సీరియల్ కి హైలైట్ అని చెప్పొచ్చు. మోనితగా శోభాశెట్టి కెరీర్ ని టర్న్ చేసిన సీరియల్ ఈ "కార్తీకదీపం". ఐతే ఆమె చేసే కుట్రలు కుతంత్రాల కారణంగా ఈమె జైలుకు వెళ్లడంతో ఆ క్యారెక్టర్ కి ఎండ్ కార్డు పడిపోయింది. తన వ్లాగ్‌లో కార్తీక దీపం షో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని చెప్తూ బాధపడింది మోనిత.

డాక్టర్ బాబు - వంటలక్క ఉన్నప్పుడు మోనిత కూడా ఉంటే బాగుంటుంది అంటున్నారు ఈ సీరియల్ ఫాన్స్. చారుశీల పాత్ర ఏమంత బాలేదని, మోనితను వెనక్కి సీరియల్ లో ప్రవేశపెట్టాలని కోరుతున్నారు కార్తీకదీపం సీరియల్ అభిమానులు. మోనిత గురించి డాక్టర్ బాబుకి అన్ని విషయాలు తెలిసిపోయాయి కాబట్టి ఇక ఈ పాత్ర అవసరం లేదని తీసేశారంటూ మోనిత కొన్ని రోజుల క్రితం బాధపడింది. ఇప్పుడు మోనిత ఫ్రెండ్ చారుశీలను రంగంలోకి దించారు ..కానీ ఆడియన్స్ కి పెద్ద కిక్ ఇవ్వడం లేదు ఈ క్యారెక్టర్. అందుకే చారుశీల రోల్ తీసేసి మోనిత రోల్ ని తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు.

ఈ సీరియల్ లో ఫేమస్ ఐన క్యారెక్టర్స్ లేవు అంటే చాలు ఆ సీరియల్ రేటింగ్ అమాంతం పడిపోతోంది. ప్రస్తుతానికి ఈ సీరియల్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసింది. మరి టాప్ వన్ పొజిషన్ లోకి రావాలి అంటే మోనిత క్యారక్టర్ ని తిరిగి ప్రవేశ పెట్టక తప్పదని మేకర్స్ భావిస్తున్నారు. ఐతే మరి మోనిత ఎప్పుడు ఎలా తిరిగి వచ్చి డాక్టర్ బాబుకి, వంటలక్కకి ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.