English | Telugu

దీపకి కార్తిక్ మోటివేషన్.. తను కొత్త లైఫ్ ని ప్రారంభించగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-60 లో.. శ్రీధర్ కంగారుగా దీపని చూసి.. సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. అది గమనించిన దశరథ్.. ఏంట్రా మీ నాన్న అలా వెళ్లిపోయాడు సడెన్‌గా అని అడుగుతాడు. ఇక్కడుంటే తన రహస్యం బయటపడిపోతుందని కార్తిక్ అంటాడు. ఏంటి రహస్యమా అని అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తారు. ఇక దీప, కార్తీక్‌లు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అది గమనించిన జోత్స్న.. వీళ్లేంటి? ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారని అనుకుంటుంది. టెన్షన్ పెట్టకుండా రహస్యం ఏంటో చెప్పరా అని సుమిత్ర అంటుంది. దీంతో కార్తీక్.. ప్రతి మగవాడి జీవితంలో కొన్ని రహస్యాలు ఉంటాయి అత్తా అని అంటాడు. ఒరేయ్ మనవడా.. నా అల్లుడు శ్రీరామచంద్రుడు.. మా అందరికి లేనిపోని అనుమానాలు కలిగించకని పారిజాతం అంటుంది.

కార్తీక్‌కి తన తండ్రి గురించి రహస్యం తెలిసిపోయిందా అని దీప కంగారు పడిపోతుంటుంది కానీ అదేం ఉండదు. దూమపానం ఆరోగ్యానికి హానికరకని కార్తీక్ అంటాడు. రేయ్.. కార్తీక్.. మీ నాన్న సిగరెట్ తాగడం ఎప్పుడో మానేశాడు కదా.. అది ఆయన ఆరోగ్యానికి మంచిది కాదురా అని కార్తిక్ తల్లి అంటుంది. అది విన్న దీప.. ఆయన సిగరెట్లు కాల్చిన దానికే ఇంత బాధపడుతున్నారంటే, ఆయన మీ జీవితాన్నే ఆర్పేస్తున్నారని అనుకుంటుంది. ఇక కార్తీక్.. తన తల్లి మాటతో.. సిగరెట్ అనేది మాస్టారు బలహీనత.. ఎప్పుడో ఒకసారి కాలుస్తారంతే అని కార్తిక్ అంటాడు. ఇక కాసేపటికి కార్తీక్, దీప ఇద్దరు మాట్లాడుకుంటారు. అదంతా జ్యోత్స్న రహస్యంగా వింటుంది. మా అమ్మనాన్నల్లాంటి వాళ్లని నేను ఇంత వరకూ చూడలేదు. అందుకే మా నాన్న అంటే గౌరవం. భర్తలంతా మా నాన్నలా ఉంటే.. భార్యలందరూ ఎంత అదృష్టవంతులో కదా’ అని కార్తిక్ అనగానే.. అంత అదృష్టం అందరికీ ఎందుకులే బాబూ.. అలాంటి అదృష్టం దక్కాలంటే రాసిపెట్టి ఉండాలని దీప అంటుంది. అదృష్టవంతురాలని సంతోషపడే మా అమ్మ కూడా ఒక్క విషయంలో బాధపడుతూ ఉంటుంది. నాకు చెల్లెలు లేదే అని.. అమ్మకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అందుకే జోత్స్నని చాలా గారాబంగా చూసుకుంటుందని కార్తిక్ అంటాడు. మీరు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోండని దీప అంటుంది. మా నాన్న ఆ ఛాన్స్ నాకు ఇవ్వరు లెండి అని కార్తిక్ అనగానే.. రోజులన్నీ ఒకే విధంగా ఉండవు కదా అని దీప అంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదని కార్తిక్ అంటాడు.

మీ శ్రేయోభిలాషిగా నాదో సలహా దీపా.. మీరు చాలా కష్టాలు కన్నీళ్లు చూశారు. ఇంక చాలండీ.. అన్నీ వదిలేయండి. చెట్టుకున్న పువ్వులాగా.. ఎగురుతున్న పక్షిలాగ బతకండి. మనస్పూర్తిగా నవ్వండి.. కడుపునిండా తినండి.. కంటినిండా తినండి. నిన్నటిని నిన్నటిలా వదిలేయండి. ఈరోజు కొత్తగా పుట్టండి. నాకేం బాధలు లేవనుకోండి. అప్పుడు దేవుడు మనకిచ్చిన జీవితం ఎంత విలువైనదో అర్థం అవుతుంది. ప్రయాణం సాగకపోతే దారి మార్చుకోవాలంతే. సెలయేరులా గమ్యం వైపు వెళ్లండి. మీరు ఆ సెలయేరులా చిరునవ్వుతో ముందుకు వెళ్లిపోండి.. నవ్వుతూ ఉంటుంది.. ఆ నవ్వే మన జీవితాన్ని మార్చుతుందని గట్టిగానే కార్తీక్ అంటాడు. చివరిగా ఒక మాట.. మీ పాట చాలా బాగుందని అంటాడు.‌ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.