English | Telugu

కనకం బ్లాక్‌మెయిల్‌తో కరిగిపోయిన కుటుంబసభ్యులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి'. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా మారుతూ వస్తుంది. స్వప్నకి రాజ్ తో పెళ్లి చేయాలని కనకం ప్రయత్నిస్తుంటుంది. కానీ స్వప్న రాజ్ ని కాకుండా రాహుల్ తో ఊహల్లో ఉంటుంది. దీంతో ఈ సీరియల్ మరింత హైప్ ని క్రియేట్ చేస్తోంది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ -19లో.. రాజ్ ఇచ్చిన బొకే స్వప్న కిందపడేస్తుంది. రాహుల్ ఇచ్చిన డైమండ్ రింగ్ చూస్తూ మురిసిపోతుంది.

మరోవైపు కనకం ఇంటికి వచ్చి డల్ గా కూర్చొని ఉండడం తో.. ఏంటి కనకం అంత ఎత్తు నుండి కిందపడ్డావా.. వాళ్ళ ముందు నీ గుట్టు బయటపడిందా అంటూ కృష్ణమూర్తి సెటైర్లు వేస్తాడు. అంతలోనే స్వప్న వచ్చి.. "అమ్మా.. ఈ డైమండ్ చూడు" అని చూపిస్తుంది. అయితే ఆ రింగ్ రాహుల్ ఇచ్చాడని చెపితే కనకం తిడుతుందని రాజ్ ఇచ్చాడని చెప్తుంది. ఆ రింగ్ చూసి కనకం అదేం పట్టించుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి స్వప్న.. "ఏంటమ్మా" అని అడుగుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ మన ఇంటికి వస్తారన్నారని డీలాగా చెప్తుంది. మనకేమైనా మీ అక్కలాగా జూబ్లిహిల్స్ లో బంగ్లాలు ఉన్నాయా? వాళ్ళు వస్తే మన పరువు పోతుందని కృష్ణమూర్తి కోపంతో కనకం ని తిట్టగా.. "అవును కదా.. మా అక్కకి బంగ్లా ఉంది కదా.. కోపంలో అన్నా.. భళే గుర్తుచేశారండి. మన ఇల్లు అదేనని చెప్తాను" అని కనకం అంటుంది. కృష్ణమూర్తి దానికి నిరాకరిస్తూ.. నీలాగా నేను అబద్ధాలు అవలీలగా ఆడలేనని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

మరోవైపు రాజ్ ఇంట్లో పనిమనిషి దొంగతనం చెయ్యడంతో.. ఆమె తప్పు లేదని ఆమెకి అవసరం ఉన్నంత డబ్బుని ఇచ్చేస్తాడు రాజ్.. అలాగే అకౌంటెంట్ పని మనిషికి డబ్బు ఇచ్చానని చెప్పాడు. అది నిజం కాదని పనిమనిషి చెప్పడంతో.. రాజ్ కి డౌట్ వచ్చి.. నీ మీద నాకు ఎప్పటి నుండో డౌట్ ఉంది. డబ్బులు దొంగలెక్కలు చూపించి తీసుకుంటున్నావ్ అని రాజ్ అతడిని జాబ్ నుండి తీసేసి.. వాళ్ళ ఇంట్లోనే సర్వెంట్ గా చేస్తాడు. అతడిని మోసం చేసిన డబ్బులు తీరేంత వరకు అలాగే పని చేయాలని చెప్పి అక్కడ నుండి రాజ్ వెళ్ళిపోతాడు.

మరోవైపు తన కూతుళ్ళని గొప్పింటికి కోడళ్ళుగా చేద్దామంటే తనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదని కనకం బాధ పడుతూ.. కిరోసిన్ ని ఒంటి మీద పోసుకొని నేను బ్రతకను అని బెదిరించేసరికి తన ముగ్గురు కూతుళ్ళు.. "అమ్మ నువ్వు చెప్పినట్టే వింటామమ్మ" అని మాటిస్తారు‌. కూతుళ్ళు ఒప్పుకున్నారు.. నేను కూడా నీకు అడ్డు రాను.. నీ చావు నువ్వు చావని చెప్పేసి వెళ్ళిపోతాడు. "మా అమ్మ నాకోసం ఇంత కష్టపడుతుంది.. నేను రాజ్ అంటే ఇష్టం లేదు.‌. రాహుల్ అంటే ఇష్టమని ఎలా చెప్పాలి" అని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.