English | Telugu
అడ్డంగా దొరికిన కైలాష్.. వేద మాటలు పట్టించుకోని మాలిని
Updated : Jun 29, 2022
స్టార్ మాలో ప్రసారం అవుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా ప్రసాం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా కీలక మలుపు తీసుకున్న ఈ సీరియల్ లోని ప్రధాన పాత్రల్లో నిరంజన్, డెబ్జాని మోడక్ నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర, రాజా శ్రీధర్ తదితరులు నటించారు. వేదపై కన్నేసిన కైలాష్ ఏం చేశాడు.. వేదని ఎలా ఇబ్బందులకు గురిచేశాడన్నది ఈ ఎపిసోడ్ లో చూద్దాం.
యష్ బిజినెస్ కాంట్రాక్ట్ పని మీద ప్రత్యే మీటింగ్ కోసం ముంబై వెళతాడు. రెండు రోజుల వరకు రాడని తెలియడంతో కైలాష్ తన ప్లాన్ ప్రకారం వేదని తన బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. తన కోసం లవ్ సింబల్ వున్న గిఫ్ట్ ని కూడా సిద్ధం చేసి తనకు ఇచ్చి ప్రపోజ్ చేయాలని సిద్ధమవుతాడు. ఇదే సమయంలో బెడ్రూమ్ లో వున్న వేద స్నానం చేసి చీర కట్టుకుని తల తుడుచుకుంటూ చీర సర్దు కుంటూ వుంటుంది.
ఇదే మంచి అదనుగా భావించిన కైలాష్ వెంటనే వేద బెడ్రూమ్ లోకి దూరిపోతాడు.. తనకు తెలియకుండానే వెనకాలే వెళ్లి వేదని తన రెండు చేతులతో బంధిస్తాడు.. ఏం జరుగుతోందో తెలుసుకునే క్రమంలో వేద షాక్ కు గురవుతుంది. నేనే వేద అని కైలాష్ అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. బలవంతంగా కైలాష్ చేతుల్లో నుంచి విడిపించుకుంటుంది. అయినా సరే కైలాష్ తనని తాకుతూ తడుముతూ వుంటాడు. వేద చీదరించుకుంటూ బయటికి వెళ్లమని.. నా బెడ్రూమ్ లోకి రావడానికి నీకు ఎంత ధైర్యమని వాదిస్తుంది. అయినా సరే పట్టించుకోని కైలాష్ తన కోసం తెచ్చిన గిఫ్ట్నిస్తాడు. చీదరించుకున్న వేద వెంటనే వెళ్లి ఈ విషయాన్ని మాలినికి చెబుతుంది. కానీ మాలిని, ఆమె కూతురు కైలాష్ మంచి వాడని కితాబిస్తారు.. ఈ విషయాన్ని యష్ కు చెప్పాలని వేద ఫొన్ చేస్తే అదే సమయంలో యష్ బెడ్రూమ్ లో మాళవిక వుంటుంది.. ఇంతకీ వేద జీవితంలో ఏం జరగబోతోంది? ఏ మలుపు తిరగబోతోంది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.