English | Telugu

Jayam : ఇషిక, వీరుల ప్లాన్ కనిపెట్టేసిన రుద్ర.. సీసీటీవీలో ఏం ఉందంటే!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -44 లో....గంగ వినాయకుడిని ఇంటికి తీసుకొని వస్తుంది. అప్పుడే పెద్దసారుపై గుమ్మం దగ్గరున్న స్పటిక కిందపడిపోతుంటే.. రుద్ర వచ్చి పెద్దసారుని పక్కకి నెట్టుతాడు. ఇక ఇంట్లో వాళ్లంతా వినాయకుడిని గంగ తీసుకొని రావడం వల్లే ఇదంతా అని అంటారు. దాంతో అలా ఏం కాదు పెద్దసారుపై స్పటిక పడకుండా దేవుడే కాపాడాడని గంగ అంటుంది.

గంగ తన మాటలతో శకుంతలని మార్చేస్తుంది. వినాయకుడిని తీసుకొని వస్తున్న గంగకి శకుంతలే స్వయంగా హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది. మరొకవైపు వీరు దగ్గరికి ఇషిక వస్తుంది. అసలు మనం అనుకున్నది ఏది జరగట్లేదు అని ఇషిక అంటుంది. రుద్ర సూపర్ మార్కెట్ లో ఆఫర్ పెట్టాడు. దీపం ఆయిల్ ఫ్రీ అని పెట్టాడు కదా.. నా మనిషి వెళ్లి పెట్రోల్ కలిపిన ఆయిల్ తీసుకొని వెళ్లి ఒరిజినల్ దీపం ఆయిల్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తాడు. దాంతో అటు సూపర్ మార్కెట్ క్లోజ్ అవుతుందని వీరు అనగానే మంచి ప్లాన్ అని ఇషిక అంటుంది.

ఆ తర్వాత గంగ మరుసటిరోజు వినాయకుడికి పూజ చేస్తుంది. వినాయకుడి కథ ఇంట్లో వాళ్ళకి వివరిస్తుంది గంగ. తరువాయి భాగంలో దీపం ఆయిల్ ప్లేస్ లో వేరే ఆయిల్ పెట్టారని రుద్రకి తెలుస్తుంది. దాంతో ఈ పని ఎవరో చేశారని సీసీటీవీలో చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.