English | Telugu

బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ కష్టాల మీద ఢీ-10 రాజు వెబ్ సిరీస్.."ఒక డాన్సర్ కథ"

ఢీ-10 రాజు అంటే డాన్సర్స్ లో తెలియని వాళ్ళు లేరు. ఢీ షో సీజన్ 10 టైటిల్ గెలిచిన తర్వాత ఆ పేరే ఇంటి పేరుగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఢీ - 20 లో కూడా కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అలాంటి రాజు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. "నేను డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో చూసుకోవడం కోసం ఒక వెబ్ సిరీస్ రాస్తున్న. త్వరలో దాన్ని డైరెక్ట్ చేస్తాను. చైత్ర మాష్టర్ "ఒక డాన్సర్ కథ" అనే టైటిల్ పెట్టి వెళ్లిపోయారు.

నేను దాన్నే కంటిన్యూ చేస్తున్నా. "ఒక డాన్సర్ కథ" అనే వెబ్ సిరీస్ రాస్తున్నాం. బాగా రాయాలని ట్రై చేస్తున్నాం. బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ గురించి ఎవరికీ తెలీదు. వాళ్ళ కష్టాల గురించి కూడా ఎవరికీ తెలీదు. బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా వచ్చిన శేఖర్ మాష్టర్ సక్సెస్ అయ్యారు. వాళ్ళ గురించి అందరికీ తెలుసు. కానీ ఓడిపోయిన వాళ్ళ గురించి ఎవరికీ తెలీదు కదా. నేను తీసేది దాని గురించే. బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ కష్టాలు అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా చాలా దారుణంగా ఉంటాయి. అందులో ఫెయిల్యూర్స్ గురించి ఫెయిల్ ఐనవాళ్ల గురించే నా వెబ్ సిరీస్ ఉండబోతోంది. ఏడాది పాటు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది. ఒక పక్కన డాన్స్ చేస్తూ మరో పక్క ఫిజియోథెరపీ తీసుకున్నా. ఒక పక్క నరకం చూస్తూ మరో పక్క హ్యాపీగా ఉండేదాన్ని. ఒక పక్కన అందరూ గుర్తుపట్టడం మొదలుపెట్టారన్న హప్పినెస్స్ ఉంటె మరో పక్కన దెబ్బలు హాస్పిటళ్లు. నాకు ఇది అలవాటైపోయింది. డాన్స్ మాత్రమే నా ఫ్యూచర్ అన్న ఫీల్ లో ఉండిపోయా. అందుకే అన్నిటినీ అలవాటు పడ్డాను." అని చెప్పుకొచ్చాడు ఢీ - 10 రాజు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.