English | Telugu

Jayam serial: ఒక్కసారిగా కుప్పకూలిన శకుంతల.. గంగ వల్లే బ్రతికిందిగా

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -152 లో......రుద్రకి వీరు ఫోన్ చేస్తాడు. బావ ఎక్కడ ఉన్నావని అడిగేలోపు స్నేహ ఫోన్ లాక్కొని అన్నయ్య గుడి నుండే వస్తున్నారా త్వరగా రండి అని అంటుంది. దాంతో స్నేహ కవర్ చేసిందని రుద్ర, గంగ అర్ధం చేసుకొని వస్తున్నామని అంటాడు. ఆ లోపు వీరు ఫోన్ తీసుకొని బావ మీ కోసం వెయిట్ చేస్తున్నాం.. త్వరగా రమ్మని రుద్రకి వీరు చెప్తాడు.

ఆ తర్వాత రుద్ర, గంగ వస్తారు. రుద్ర బయట నుండే స్వామిని చూస్తాడు. రుద్ర వెనక్కి వెళ్తుంటే బావ లోపలికి రా అని వీరు పిలుస్తాడు. బయటే షూస్ విప్పమని గంగకి చెప్తాడు. ఇద్దరు లోపలికి రాగానే ఇలాగేనే గుడికి వెళ్ళేది బాగా పద్ధతులు నేర్పుతున్నావని శకుంతలని స్వామి అంటాడు. ఈ వస్త్రాధరణతోనేనా ఆశీర్వచణం ఇచ్చేదని స్వామి కోప్పడతాడు. ఆ తర్వాత గంగ, రుద్ర బట్టలు మార్చుకొని వస్తారు. ఇద్దరిని ఆశీర్వదిస్తాడు. వాళ్లకు కొంచెం పద్ధతి గురించి చెప్పండి అని శకుంతల అనగానే.. వాళ్ళకి కాదు నీకు చెప్పాలని స్వామి అంటాడు. వాళ్ళది పద్దతి ప్రకారం పెళ్లి జరగలేదు.. కులదేవత గుడికి తీసుకొని వెళ్ళలేదని స్వామి, శకుంతలపై కోప్పడతాడు.

రేపు గుడికి తీసుకొని వెళ్ళు.. నువ్వు నూట ఒక్క ప్రదక్షిణలు చెయ్ అని స్వామి అనగానే.. నేను చేస్తాను అని రుద్ర అంటాడు. లేదు తనే చెయ్యాలని స్వామి చెప్తాడు. స్వామి వెళ్ళిపోయాక ఇదంతా గంగ వళ్లే అని ఇషిక, వీరు అంటుంటే శకుంతల కిందపడిపోతుంది. దాంతో గంగ వచ్చి శకుంతల ఛాతిపై నొక్కుతు లేపే ప్రయత్నం చేస్తుంది. ఆ లోపు డాక్టర్ వస్తాడు. గంగ నీ వల్లే ఇదంతా తనే బాలేదు అంటే అత్తయ్యని కుదిపేశావని ఇషిక కోప్పడుతుంది. తను అలా చెయ్యడం వల్లే ఈవిడ ఇలా ఉంది. అలా చేసి మంచి పని చేసిందని డాక్టర్ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే .

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.