English | Telugu

Jayam serial : గంగ, రుద్రలతో సత్యనారాయణ వ్రతం చేయించాలనుకున్న పెద్దసారు!

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -131 లో..వీరు, ఇషిక కలిసి గంగ గురించి శకుంతల మైండ్ లో నెగెటివ్ గా క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత గంగని తీసుకొని రుద్ర ఇంటికి వస్తాడు. ఇక మీదట మార్నింగ్ నుండి నేను చెప్పిన డైట్ ఫాలోకమ్మని రుద్ర చెప్పగానే ఆలా చేయకపోతే ఏం చేస్తారని గంగ అంటుంది. కట్టె పట్టుకొని కొడుతా అని రుద్ర అంటాడు. నేను చెయ్యనని గంగ పరుగెడుతుంది. తన వెంటే రుద్ర కట్టె పట్టుకొని పరుగెడుతాడు.

అలా గంగతో రుద్ర సరదాగా ఉండడం శకుంతల చూసి ఇక్కడ ఏం జరుగుతుందని గట్టిగా ఆరుస్తుంది. కోడలిగా ఒప్పుకో అన్నారు కదా ఇలా మగరాయుడు లాగా ఉంటే ఎవరు ఒప్పుకుంటారు.. వద్దని చెప్పాల్సిన భర్త సపోర్ట్ గా ఉంటే ఏం చేస్తారని పెద్దసారుతో శకుంతల అంటుంది. ఒకసారి గెలిస్తే ప్రతీసారీ అలా అవుద్దా.. ఇప్పటికే ఒక కేసులో ఇరుకున్నాడని శకుంతల అనగానే అమ్మగారు సపోర్ట్ చెయ్యాల్సిన మీరే ఇలా అనడం కరెక్ట్ కాదని గంగ అంటుంది. అత్తయ్యకి ఎదురు తిరుగుతావా అసలు అత్తయ్య బాను బావ చావుకి కారణం రుద్ర బావ అన్న విషయం పక్కన పెట్టి రుద్ర బావని క్షమించిందని వీరు అంటాడు. అలా అంటావేంటని పెద్దసారు అనగానే సారీ మావయ్య అనుకోకుండా వచ్చిందని వీరు అంటాడు.

ఆ తర్వాత లక్ష్మీ మందులకి దాచుకున్న డబ్బు పైడిరాజు తీసుకుంటాడు. ఇలా అయితే కష్టం నేనే ఏదో పని చూసుకోవాలని లక్ష్మీ అనుకుంటుంది. ఆ తర్వాత రుద్ర దగ్గరికి పెద్దసారు వస్తాడు. గంగని బాక్సింగ్ ప్రాక్టీస్ చేయించు అంటాడు. తనని పెళ్లి చేసుకుందే అందుకోసం అని రుద్ర అంటాడు. అప్పుడే ప్రమీల వస్తుంది. పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం చేయించలేదని అంటుంది. అవును చేయించాలని పెద్దసారు నిర్ణయం తీసుకుంటాడు. అదంతా వీరు, ఇషిక విని వ్రతంలో డిస్టబెన్స్ వచ్చేలా చెయ్యాలని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.