English | Telugu

ఒకప్పుడు ఆవులకు, దూడలకు వేసిది.. ఇప్పుడు నువ్వు తింటున్నావ్!



అనసూయ భరద్వాజ్.. టెలివిజన్ రంగంలో యాంకర్ గా అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటి తెచ్చుకున్న అనసూయ..‌ 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించిన అనసూయ.. తాజాగా 'రంగమార్తాండ' సినిమాలో మంచి పాత్రని చేసానని మీడీయా ముందు ఎమోషనల్ అయింది. తన తర్వాతి సినిమా 'విమానం' మూవీ పోస్టర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడి నుండే ప్రమోషన్ ని మొదలుపెట్టింది. అయితే 'విమానం' సినిమా కథ బాగుండటంతో విమర్శకుల ప్రశంసలు పొంది భారీ హిట్ గా నిలిచింది. దాంతో అనసూయ ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది.

అనసూయ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీకెండ్ పార్టీలని, హోమ్ టూర్ అని, సమ్మర్ వేకేషన్ అంటూ తన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే నిన్న మొన్నటిదాకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవ పడుతూ పోస్ట్ లు చేసిన అనసూయ‌.. ఆ గొడవ సద్దుమణిగిందనేలోపే, మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి దాకా జ్యువలరీ ప్రమోషన్స్, శారీ ప్రమోషన్స్ అంటూ బ్రాండ్స్ కోసం ప్రచారం చేస్తూ బిజీగా ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది అనసూయ. హ్యాపీ వీకెండ్ గాయ్స్ అంటూ తను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తింటున్న ఫొటోస్ ని షేర్ చేసింది అనసూయ. అయితే అనసూయ ఏది చేసిన తప్పే అన్నట్లుగా నెటిజన్ల తీరు ఉంది. ఒక్కొక్కరు ఒక్కోలా అనసూయని తిడుతూ కామెంట్ చేస్తున్నారు. ఇదంతా వాళ్ళ కామెంట్లు చూసి చెప్పొచ్చు. అయితే అనసూయ చేసిన పోస్ట్ కి "నువ్వు తినేది.. ఒకప్పుడు మేము ఆవులకు, దూడలకు వేసేవాళ్ళం. ఇప్పుడు నువ్వు తింటున్నావ్" అని ఒకతను కామెంట్ చేశాడు. "అది విజయ్ దేవరకొండ వెళ్లిన హోటల్ కదా.. సేమ్ అదే హోటల్ లో విజయ్ దేవరకొండ దిగిన ఫోటో తన ఇన్ స్టాగ్రామ్ లో ఉంది" అని మరొకరు కామెంట్ చేశారు. ఇప్పటికే అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య రచ్చ నడుస్తుంది. ఇక ఈ కామెంట్స్ కి అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.