English | Telugu

Guppedantha Manasu : ఉత్కంఠ మొదలైంది.. బోర్డ్ మీటింగ్ లో ఏం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1098 లో.. రిషిని తీసుకొస్తానని నువ్వు అడిగిన మూడు నెలల గడువు ముగుస్తోంది. కనీసం ఇప్పటికైనా మార్చుకో వసుధార... రిషి వస్తాడు.. రాడు అని నాన్చడం మంచిది కాదు. వచ్చేవాడే అయితే ఎప్పుడో వచ్చేవాడు. ఇక రిషి రాడు.. ఎప్పటికైనా వస్తాడనుకునే వాళ్ల కోసం ఎన్నాళ్లైనా ఎదురుచూడొచ్చు.. కానీ ఎన్నటికీ రాని వాళ్లకోసం ఎదురుచూడటం అమాయకత్వం అవుతుంది. నా మాట విని రిషి లేడనే నిజాన్ని గ్రహించుకోవాలి. నీకే కాదు.. నాకూ బాధగానే ఉంటుంది. రిషి అంటే నాకెంత ఇష్టమో నీకూ తెలుసు.. రిషిని నేను కన్న కొడుకుకంటే ఎక్కువగానే చూసుకున్నాను. రిషినే ఈ భూషణ్ ఫ్యామిలీకి వారసుడిగా ఉంటాడని నేను అనుకున్నా. కొన్నాళ్ల తరువాత మొత్తం బాధ్యతలన్నీ రిషికి అప్పగించి నేను తప్పుకుందామనుకున్నా. కానీ ఈ లోపే ఇలా అయ్యిందని ఫణీంద్ర అంటాడు. వసుధార, మహేంద్ర మౌనంగా ఉంటారు.

ప్రతిరోజూ రిషిని గుర్తు చేసుకుంటూనే ఉంటానమ్మా.. కష్టంగా ఉన్నా తప్పదమ్మా.. కాలానికి తలవంచాల్సిందే. రిషి మనల్ని వదిలేసి మనకి అందనంత దూరం వెళ్లిపోయాడు. రిషి టైమ్ ముగిసింది. ఈ లోకాలన్ని వదిలేశాడని ఫణీంద్ర అనగానే.. మీరు ఎన్నైనా చెప్పండి.. రిషి చనిపోయాడంటే నేను ఒప్పుకోనని వసుధార అంటుంది. దాంతో దేవయాని.. ఏంటి వసుధార ఇది. ఇంత మంది ఇన్ని విధాలుగా చెప్తుంటే పాడిన పాటే మళ్లీ మళ్లీ పాడతావేంటి.. నిన్న మినిస్టర్‌గారు మాట్లాడుతుంటే లెక్కలేకుండా మధ్యలోనే లేచి వెళ్లిపోయావట.. రిషి అంటే నీకొక్కదానికే ప్రేమ ఉన్నట్టుగా.. మాకెరివకి ప్రేమ లేనట్టు ఎందుకలా ప్రవర్తిస్తావ్. రిషిని నా చేతులతో పెంచాను. నాకు మాత్రం బాధలేదా? చనిపోయినవాడ్ని బతికున్నాడని చెప్పి.. నీ పరువు నువ్వు తీసుకోవడమే కాదు.. రిషి పరువుని కాలేజ్ పరువుని కూడా తీస్తున్నావని వసుధారతో దేవయాని అంటుంది. ఆ తర్వాత శైలేంద్ర కూడా మాటలతో విసిగిస్తాడు. ఇక ఫణీంద్ర కలుగజేసుకొని.. ఒప్పుకో వసుధార.. ఒప్పుకో.. నువ్వు ఒప్పుకుంటే.. అందరం కలిసి రిషికి సంతాప సభ పెడతాం.. అప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం దొరకుతుంది. బాధపడతాం కానీ.. ఒక వారం పది రోజుల్లో ఆ బాధల్లో నుంచి బయటకు వచ్చి ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. లేదంటే ఈ గొడవలు గోలలు ఇలాగే కంటిన్యూ అవుతాయని ఫణీంద్ర అంటాడు.

కాసేపటికి వసుధార బోర్డ్ మీటింగ్ పెడుతుంది. మినిస్టర్‌తో పాటు కాలేజ్ డైరెక్టర్లంతా వస్తారు. వసుధార ఏదో కఠినమైన నిర్ణయం తీసుకుంది? అది ఏంటని మినిస్టర్‌తో సహా అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. అయితే వసుధార మీటింగ్ కి వెళ్లకుండా.. ఆ ఎండీ చైర్‌ని పట్టుకుని ఏడుస్తుంటుంది. రిషి సర్.. మీరు వేరు.. నేను వేరు కాదు సర్.. తనువులు వేరైన ఊపిరి ఒక్కటే సర్ అంటూ వసుధార ఎమోషనల్ అవుతుంది. ఇంతలో మను అక్కడికి వస్తాడు. ఏం చేయబోతున్నారు మేడమ్ అని మను అడుగగా.. వసుధార మౌనంగా ఉంటుంది.. చెప్పండి మేడమ్.. చెప్పండి.. మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో నాకు చెప్పండి.. నాకు తెలియాలి.. నాకు తెలియాల్సిందేనని మను అంటాడు. నా నిర్ణయం ఏంటో మరిసేపట్లో మీకే తెలుస్తుందని వసుధార అంటుంది. అది కాదు మేడమ్.. నాకు ఇప్పుడే చెప్పండి అని మను అంటాడు. లేదు మను గారు.. కొన్ని కొన్ని నిర్ణయాలు అందరికి ఒకేసారి చెప్పాలి. బోర్డ్ మీటింగ్‌లో అందరితో పాటు మీకూ తెలుస్తోందని వసుధార అనగానే.. మీరేం చేస్తారో అని కంగారుగా ఉంది మేడమ్ అని మను బాధపడిపోతుంటే.. నేనేం చనిపోనని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.