English | Telugu

ఇంద్రజ నోటా పవన్ కళ్యాణ్ మాటా...డొక్కా సీతమ్మ నిజంగా అన్నపూర్ణాదేవినే..

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఎవ్వరికైనా కళ్ళు చెమ్మ కాక మానవు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఉమెన్స్ డే. ఈరోజున ఈ షో లేడీస్ స్పెషల్ ఎపిసోడ్ గా రాబోతోంది. అలాగే అందరికీ ఆకలి తీర్చే అమ్మ డొక్కా సీతమ్మ తల్లిని అందరూ స్మరించుకున్నారు. నిజంగా ఆమె గురించి పరిచయం చేసిందే పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఆయన ఆ తల్లిని ఎన్నో సార్లు స్మరించుకున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రతీ ప్రసంగంలో ఆమెను తలుచుకోకుండా ఉండరు...ఏ దానానికి ఆ దానం గొప్పది కానీ అలాంటి దానాల్లోకెల్లా అన్నదానం ఇంకా గొప్పది. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వచ్చిన వాళ్లకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన ఆ మహనీయురాలి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆమె గురించి తెలిసేలా చేసారు. ఆ తరువాత ఇంద్రజ ఆ విషయాన్ని ప్రస్తావించారు. "డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆవిడ పేరుతో అన్నదానం జరిపించాలని అని చెప్పిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆవిడ మీద అందరికీ ఒక అవగాహన వస్తోంది" అని చెప్పారు.

అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అన్నా క్యాంటిన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటిన్లు రావాలి అంటూ చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఆకలి అంటూ తన ఇంటికి ఎవరు వచ్చినా ఆమె కాదు, లేదు, పెట్టలేను అనే వారు కారట. ఈ అన్నదానం కార్యక్రమం వలన ఆమె ఆస్తులన్నీ కరిగిపోయి కష్టాలొచ్చినా కూడా ఆమె వెనకడుగు వేయకుండా నిత్యాన్నదానం చేస్తూనే ఉన్నారట. అందుకే ఆమె పేరు తలచుకున్నా ఆమె దాన గుణం గురించి స్మరించుకున్నా ఎక్కడా లేని ధైర్యం వస్తుంది అంటారు. అందుకే పవన్ కళ్యాణ్ ఆమె గురించి ప్రసంగించినప్పుడల్లా ఆయన మాటల్లో ఎదో తెలియని ధైర్యం కనిపిస్తుంది. ఇక ఇలా ఈ వారం షో మహిళల కోసం రూపొందించారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.