English | Telugu

'Family Week Episodes' లో తగ్గేదేలే అంటున్న కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ వీక్షకులకు ఈ వారం కంటెస్టెంట్స్ అందించే వినోదం మామూలుగా లేదు. ' ఎంటర్టైన్మెంట్ పరంగా ఫుల్ మీల్స్' అనే చెప్పాలి. కంటెస్టెంట్స్ ఎన్నడూ లేని విధంగా ఎమోషన్స్ తో కలగలిపి వినోదాన్ని ఇస్తూ వస్తోన్నారు.

అయితే వారం కెప్టెన్సీ టాస్క్ గా ఇచ్చిన 'బిగ్ బాస్ కోచింగ్ సెంటర్' లో ప్రతి కంటెస్టెంట్ చిన్న పిల్లలు అయిపోయారు. సమయానుసారం బిగ్ బాస్ పంపించే ఆదేశాలను ఫాలో అవుతూ, వీక్షకుల మనసును గెలుచుకుంటున్నారు. అయితే కంటెస్టెంట్స్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ రోల్ ని ఇన్వాల్వ్ అయ్యి వినోదాన్ని పంచాలి. అందులో భాగంగా ఫైమా ఇంగ్లీష్ టీచర్ గా 'వచ్చి రాని ఇంగ్లీష్' తో ఫన్ ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆదిరెడ్డికి డ్యాన్స్ టీచర్ రోల్ రావడంతో, అందరిని తన మార్క్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు అని అనడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే తనకు రాని డాన్స్ ని ఫన్నీ గా నేర్పిస్తూ, హౌస్ మేట్స్ తో పాటుగా వీక్షకులను మెప్పించాడు. అదే విధంగా రాజ్ సింగర్ గా చేసి అలరించాడు. ఆ తర్వాత శ్రీసత్య మేకప్ టీచర్ గా అదరగొట్టింది.

ఆ తర్వాత శ్రీహాన్ 'Flirting Teacher' గా ఆకట్టుకోగా, రేవంత్ యోగా టీచర్ గా చేసాడు. మంచి కామెడీ టైమింగ్ తో హౌస్ లో నవ్వులు పూయించాడు. టాస్క్ లే కాకుండా, ఫ్యామిలీ మెంబెర్స్ రావడంతో వినోదానికి, ఎమోషన్ తోడైంది. హౌస్ మేట్స్ టాస్క్ మీద చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగే ఫ్యామిలీతో వాళ్ళ ఎమోషన్ ని పంచుకుంటున్నారు. అందరూ కూడా ఎవరి ఫ్యామిలీ వచ్చినా, వాళ్లతో కలిసిపోయి మాట్లాడటం అనేది 'హైలైట్ అఫ్ ది వీక్' అని చెప్పొచ్చు. ఒక్కో కంటెస్టెంట్ తమ ఫ్యామిలీ ఎమోషన్ ని తీర్చుకుంటూ, టాస్క్ లో ఇరగదీస్తున్నారు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.