English | Telugu
Immanuel BB Journey video : గూస్ బంప్స్ తెప్పించిన ఇమ్మాన్యుయేల్ జర్నీ వీడియో.. ఇది హిట్టు బొమ్మ!
Updated : Dec 18, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో చివరి వారం సాగుతోంది. ఇమ్మాన్యుయేల్, పవన్ కళ్యాణ్ పడాల, తనూజ, డీమాన్ పవన్, సంజన ల.. ఈ అయిదుగురు టాప్-5 కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఇక వీకెండ్ కి మరో మూడు రోజులు ఉంది.. బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలియాలంటే సండే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
హౌస్ లో ఉన్న టాప్-5 కంటెస్టెంట్స్ లో మొదటగా ఇమ్మాన్యుయేల్ జర్నీ వీడియోని ప్లే చేశాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఇమ్మాన్యుయేల్ ఇప్పటి వరకు హౌస్ లో ఆడిన గేమ్స్, మెమరీస్, ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అమ్మతో కలిసి ఉన్న ఫోటోలని చూసుకొని మురిసిపోయాడు ఇమ్మాన్యుయేల్. ఇక బిగ్ బాస్ తన మాటల గారడీ మొదలెట్టాడు.
బాధ, ఆశ, ఓటమి ఈ ఎమోషన్స్ నుంచి మనుషులు పారిపోవాలని చూస్తారు.. కానీ అది సాధ్యం కాదు.. అందుకే వాటి నుంచి తేరుకోవడానికి రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లడానికి మాటిమాటికి మనుషులు కోరుకునే ఎమోషన్ ఆనందం.. దాన్ని తన మన భేదం లేకుండా అందరికీ పంచేవారే ఎంటర్టైనర్స్.. వీరికి ప్రేక్షకుల నుంచే కాదు ఆ దేవుడి నుంచి కూడా ఎప్పుడూ ఆశీస్సులు మెండుగా లభిస్తాయి.. దాని నిదర్శనమే మీ ప్రయాణం. మీ ఆటతీరు నాకు సంతోషాన్నిచ్చింది. హౌస్ లో నీకు మమ్మీ దొరికింది. గేమ్స్ లో నీ స్నేహితులు నీపై మాటలు అన్నా.. నువ్వు పట్టువదలేదు.. నీ వాళ్ళని వదల్లేదు.. ఎంటర్ టైన్ చేశావ్.. తెలివేటలు వాడావ్.. దాదాపు మీ లెక్కలన్నీ కరెక్ట్ అయ్యాయి.. అంత షార్ప్ గా మీ బుర్ర ఉన్నప్పుడు అక్కడ జుట్టు ఎలా ఉంటుంది చెప్పండి అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో ఇమ్మాన్యుయేల్ నవ్వుకున్నాడు.
గొప్ప మనిషిగా ఎదగడానికి జుట్టు అక్కర్లేదు.. ఆడంబరాలు అక్కర్లేదు.. గొప్ప చదువులు అక్కర్లేదు.. గొప్ప వ్యక్తిత్వం ఉంటే సరిపోతుంది.. ఇది మీ ప్రయాణంతో నిజమైందని బిగ్ బాస్ చెప్పగా థాంక్స్ బిగ్ బాస్ అని ఇమ్మాన్యుయేల్ చెప్పాడు. కమెడియన్ గా అడుగుపెట్టినా హీరోగా బయటకు రావాలనే మీ అమ్మ కల నెరవేరిందని బిగ్ బాస్ అన్నాడు. అది విని ఇమ్మాన్యుయేల్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక తన జర్నీ వీడియో చూసి ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. థాంక్స్ టూ బిగ్ బాస్.. థాంక్స్ టూ అమ్మ.. థాంక్స్ టూ ఆడియన్స్ అంటూ ఇమ్మాన్యుయేల్ చెప్పుకొచ్చాడు. దిజ్ ఈజ్ ఆల్ టైమ్ ఫెవరెట్ అండ్ బెస్ట్ జర్నీ వీడియోగా నిలిచిపోయింది. ఈ జర్నీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.