English | Telugu

Eto Vellipoyindhi Manasu : రామ్ పుట్టినరోజుకి రామలక్ష్మి వస్తుందా.. షాక్ లో సీతాకాంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -346 లో.....రామలక్ష్మి రామ్ కి టీసీ ఇస్తానని చెప్పడంతో.. నేను భోజనం చెయ్యనంటు రామ్ మారం చేస్తుంటాడు. నాకు ఆ మిస్ కావాలి. నాతో సరదాగా ఆడుకుంటుందని రామ్ ఏడుస్తుంటే.. నువ్వు ఆ స్కూల్ లోనే ఉంటావ్. నేను మేడమ్ తో మాట్లాడతానని రామ్ ని సీతాకాంత్ బ్రతిమాలతాడు. రామలక్ష్మి తన క్యాబిన్ లోకి వచ్చి తనకి సంబంధించిన వస్తువులు తీసుకుంటుంది. అప్పుడే ఇద్దరు టీచర్స్ వస్తారు. ఈ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ రామ్ కి ఇవ్వండి అని చెప్పి బయలుదేర్తుంది.

రామలక్ష్మి వెళ్ళాక సీతాకాంత్ రామ్ ని తీసుకొని వస్తాడు. మేడమ్ వేరొక దగ్గరికి వెళ్తుంది. ఇక రాదని చెప్తారు. ఈ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పిందని వాళ్ళు చెప్పగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఎంతసేపు అవుతుందని సీతాకాంత్ అడుగుతాడు. ఇప్పుడే అనగానే సీతాకాంత్ పరిగెత్తుకుంటూ వెళ్లి రామలక్ష్మి కార్ ని ఆపాలని చూస్తాడు. మేడమ్ ఆగండి అంటున్నా రామలక్ష్మి వినిపించుకోదు.. అప్పుడే రామ్ పడిపోతాడు. అది చూసి సీతాకాంత్ వెళ్తాడు. రామలక్ష్మి కూడా వెళ్తుంది. మేడమ్ మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టానని సీతాకాంత్ రిక్వెస్ట్ చేస్తాడు. రామ్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు. లేదని రామలక్ష్మి అంటుంది. రేపు రామ్ పుట్టినరోజు మీరు రండి అని సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చి బాధపడుతుంది. ఇక మళ్ళీ వీళ్ళని కలవను కదా రేపు పుట్టిన రోజుకి వెళ్తానని ఫణీంద్ర, సుశీలలకి చెప్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్తే రాగలవా అని సుశీల అనగానే.. వెళ్లనివ్వు మళ్ళీ రాదు కదా అని ఫణీంద్ర అంటాడు.

మరుసటి రోజు రామ్ పుట్టినరోజు బట్టలు వేసుకోమని సీతాకాంత్ రిక్వెస్ట్ చేస్తుంటాడు. మా మిస్ వస్తేనే వేసుకుంటానని మారం చేస్తాడు. దాంతో శ్రీలతకి కోపం వచ్చి కొట్టబోతుంటే సీతాకాంత్ ఆపుతాడు. ఆ తర్వాత సిరి ఫోటో దగ్గరికి వెళ్ళి శ్రీలత బాధపడుతుంది. ఈ రోజే మీ కూతురు చనిపోయిన రోజు.. ఈ రోజే తన కొడుకు పుట్టినరోజు.. ఒకవైపు ఆనందం.. ఒకవైపు బాధ అని పంతులు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.