English | Telugu

Illu illalu pillalu : వీడియో కాల్ చేయమన్న నర్మద.. భాగ్యం బండారం బయటపడనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -148 లో....శ్రీవల్లి చందు, వేదవతి, ప్రేమ , ధీరజ్ భాగ్యం ఇంటికి వస్తారు. ఇక వాళ్ళంతా రాగానే శ్రీవల్లిని హగ్ చేసుకుంటుంది భాగ్యం. నేను చెప్పినట్లు నగలు తీసుకొని వచ్చావా అని అడుగుతుంది. తీసుకొని వచ్చానని శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత భాగ్యం హారతి ఇచ్చి శ్రీవల్లి, చందులని ఆహ్వానిస్తుంది. అందరు లోపలికి వెళ్ళాక నర్మద, సాగర్ ఎందుకు రాలేదని భాగ్యం అడుగుతుంది. వదినకి లీవ్ ఇవ్వలేదని అమూల్య చెప్తుంది.

ఆ తర్వాత శ్రీవల్లిని తీసుకొని భాగ్యం పక్కకి వెళ్తుంది. నగలన్నీ తీసుకొని వచ్చినట్లే కదా అని శ్రీవల్లిని భాగ్యం అడుగుతుంది. తీసుకొని వచ్చాను ఆ కామాక్షి ఆడపడుచు కట్నం అంటే ఒక నగ తీసి ఇచ్చానని శ్రీవల్లి అనగానే.. అది గిల్ట్ నగ ఎందుకు ఇచ్చావ్.. ఎక్కడైనా చెక్ చేయిస్తే బండారం బయటపడుతుంది. నువ్వు వెళ్ళాక తనని మాయ చేసి తీసుకోమని భాగ్యం చెప్తుంది. నేను ఎలాగోలా మీ పెళ్లి చేశాను. నీ కాపురం జాగ్రత్త అంటూ శ్రీవల్లితో భాగ్యం చెప్తుంటే ప్రేమ వస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంది అంత విన్నదేమోనని ఇద్దరు టెన్షన్ పడుతారు కానీ ప్రేమ వినదు. వాటర్ కోసం వచ్చానని ప్రేమ చెప్పగానే భాగ్యం వాటర్ ఇస్తుంది. మరొకవైపు నర్మద సాగర్ ని తీసుకొని శ్రీవల్లి వాళ్ళు నాన్న ఇంట్లో ఉన్నాడో లేదో చూడడానికి వస్తుంది. శ్రీవల్లి వాళ్ళు నాన్న నర్మద, సాగర్ వెళ్ళకముందే ఇంటికి వెళ్లాలని పరుగెడతాడు.

ఆ తర్వాత భాగ్యం కావాలనే ప్రేమ చేత టీ కప్పులు తీయిస్తుంది. భాగ్యం టీ కింద పడబోసి ఏమనుకోకు అమ్మ కాస్త ఇది క్లీన్ చేస్తావా అని భాగ్యం అనగానే ప్రేమ క్లీన్ చేస్తుంది. అది ధీరజ్ చూసి వచ్చి ప్రేమని ఆపుతాడు. తరువాయి భాగంలో నర్మద, సాగర్ భాగ్యం ఇంటికి వచ్చి బాబాయ్ గారిని పిలవండి అంటారు. ఆయన లేడని భాగ్యం అనగానే వీడియో కాల్ చెయ్యమని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.