English | Telugu

Brahmamudi:  దొరికిపోయిన గజదొంగ ఛార్లెస్.. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-734లో.. అప్పు, కళ్యాణ్ ల శోభనం గదిని డెకరేట్ చేసిన రాజ్, కావ్య ఇద్దరు అదే గదిలో ఉంటారు. అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఛార్లెస్ అనే దొంగ కోసం బయటకు వెళ్తారు. అదే సమయంలో ధాన్యలక్ష్మికి డౌట్ వచ్చి అప్పు, కళ్యాణ్ ల గది దగ్గరికి వెళ్తుంది. ఇక రాజ్, కావ్య తెలివిగా ఆలోచించి.. వారి మొబైల్ ఫోన్ లో ఆల్రెడీ రికార్డ్ చేసిన అప్పు, కళ్యాణ్ ల వాయిస్ రికార్డింగ్స్ ని ప్లే చేస్తారు. అది విని ధాన్యలక్ష్మి ఇద్దరు గదిలోనే ఉన్నారని కన్ఫమ్ చేసుకుంటుంది.

ఇక ధాన్యలక్ష్మి గది బయట డోర్ దగ్గర ఉండగా ప్రకాశ్ వస్తాడు. ఇలా కొడుకు, కోడలి శోభనం జరుగుతుంటే బయట నువ్వు ఉండటం తప్పు అని కోప్పడి తనని తీసుకెళ్తాడు. ఆ తర్వాత అప్పు చార్లెస్ దొంగ కోసం వెళ్తుంది. వాడు తప్పించుకొని రాజ్, కావ్య ఉన్న గదిలోకి దూరతాడు. మరోవైపు రాజ్, కావ్య ఇద్దరు కలిసి ఛార్లెస్ అనే దొంగ గురించి వెతకడానికి అప్పు వెళ్ళిందని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు గొడవపడుతుంటారు.

అదే సమయంలో ఛార్లెస్ దుగ్గిరాల ఇంటికి వస్తాడు. సరిగ్గా శోభనం గది దగ్గరికి వస్తాడు. అక్కడ అప్పటికే రాజ్, కావ్య ఇద్దరు గమనించిన ఛార్లెస్ లైట్లు ఆపేసి.. రాజ్, కావ్యని తాడుతో కట్టేస్తాడు. ఆ తర్వాత లైట్లు ఆన్ చేస్తాడు ఛార్లెస్. అతడిని చూసిన రాజ్, కావ్య ఇద్దరు షాక్ అవుతారు. నువ్వేంట్రా ఇక్కడ, అప్పు నా చెల్లి తను నాలాగా సాఫ్ట్ కాదంటూ చార్లెస్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది. చార్లెస్ అవేమీ పట్టించుకోకుండా శోభనం గదిలోని స్వీట్లు తింటుంటాడు. ఇక రాజ్ తెలివిగా ఆలోచించి తన ఫోన్ ని తీసుకొని అప్పుకి మెసెజ్ చేయలానుకుంటాడు. కమింగ్ అప్ లో కావ్యకి రాజ్ తన మనసులో మాట చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ వరకు ఆగాల్సిందే.