English | Telugu

బ్రేకప్ లవ్ స్టోరీ ని బయటపెట్టిన అఖిల్!

ఢీ-14 ప్రతీ వారం ఏదో ఒక స్పెషల్ థీమ్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ వారం కూడా అలానే జోష్ తెప్పించే డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో అలరించింది. ఈ వారం లవ్ థీమ్ తో డాన్సులు చేశారు కంటెస్టెంట్స్. ఇక ఈ షోలో అఖిల్ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు. 10th చదువుకునేటప్పుడు 8th క్లాస్ అమ్మాయిని ప్రేమించాడు.

అలా కొన్నాళ్ల తర్వాత తాను ఇండస్ట్రీకి వెళ్లి తనను తాను ప్రూవ్ చేసుకుంటానని తర్వాత ప్రేమ, పెళ్లి అనేసరికి ఆ అమ్మాయికి మాత్రం ఆ విషయం నచ్చలేదు. ఇండస్ట్రీలోకి వెళ్లడం తనకు, తన ఫామిలీ కూడా ఇష్టం లేదని చెప్పాడు. ఐనా తన ప్యాషన్ ని వదులుకోలేక ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పాడు అఖిల్.

ఎన్నోసార్లు ఆ అమ్మాయి కోసం ట్రై చేస్తూనే ఉన్నట్లు చెప్పాడు అఖిల్. ఒకానొక సమయంలో బ్రేకప్ కూడా చెప్పేసింది. ఆ మాటకు చాలా బాధపడినట్లు చెప్పాడు. చివరికి మాట్లాడ్డం మానేసిందట. అలాంటి టైములో ఒక రోజు ఒక ఫంక్షన్ లో కలవమని చెప్పి అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు తనను అవమానించిందని చెప్పాడు అఖిల్. ఆ బాధ భరించలేక అక్కడినుంచి వచ్చేసాడట.

తర్వాత ఫోన్ చేసి "నువ్ సూసైడ్ గాని చేసుకున్నవేమో అని ఫోన్ చేశా" అంటూ ఇంకా ఏడిపించింది చెప్పాడు. అలా ఆ పెయిన్ తో ఇండస్ట్రీలో తనను తాను ప్రూవ్ చేసుకున్నట్లు చెప్పాడు. కానీ ఫస్ట్ లవ్ అనే దాన్ని ఎప్పుడూ మరచిపోలేము కదా అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పి అందరికీ కన్నీళ్లు తెప్పించాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.