English | Telugu

పాన్ పరాగ్ తినేదానివి... పాన్ ఇండియా హీరోయిన్ అవుతావా!

ఢీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ప్రతీ వారం ఆది ఏదో ఒక గెటప్ తో వస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఆది మల్లెపూల బాబా వేషంలో వచ్చాడు. వచ్చి అందరి జాతకాలు చెప్పాడు. ఆది బాబాతో జ్యోతిష్యం చెప్పించుకోవడానికి శ్వేతా నాయుడు వచ్చింది.. "నేనొక పెద్ద పాన్ ఇండియా హీరోయిన్ ని కావాలనుకుంటున్నా.." అనేసరికి "ఈ పాన్ పరాగులు తిని ఊసేది పాన్ ఇండియా హీరోయిన్ అవుతుందట" అంటూ ఆది జోక్ వేసాడు. ఆ డైలాగ్ కి శ్వేతా షాకైపోయింది.

తర్వాత శేఖర్ మీద పడ్డాడు ఆది. "శేఖర్ తురాణాం న భయం న సిగ్గు" అని అన్నాడు...తర్వాత షోకి హీరో సత్యదేవ్ వచ్చాడు. "బట్టలన్నాక మాసిపోవడం మనుషులన్నాక మోసపోవడం చాలా కామన్ సర్" అనే డైలాగ్ తో అందరినీ నవ్వించాడు. తరువాత రాఖీ వచ్చి "గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ " అనే సాంగ్ కి డాన్స్ ని పెర్ఫార్మ్ చేసాడు. "ఏదేమైనా ఈ టవల్ పడితే ఒక ఎనెర్జీ వస్తుంది" అంటూ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మేడలో వేసుకునే ఎర్ర టవల్ ని చూపించాడు. తర్వాత సత్యదేవ్ ఆ టవల్ ని తన భుజం మీద వేసుకుని స్టేజి మీదకు వెళ్లి రాఖీతో కొరియోగ్రాఫర్ తో కలిసి పవన్ కళ్యాణ్ స్టెప్స్ వేసాడు. ఫైనల్ గా హోస్ట్ నందు ఒక ట్విస్ట్ పెట్టాడు. వర్షిణి, రాఖీ, సహృద ఈ ముగ్గురినీ పక్కన నిలబెట్టి ఒకరిని ఎలిమినేట్ చేయాలంటూ మిగతా ముగ్గురు కంటెస్టెంట్స్ ని అడిగాడు నందు. ఐతే శ్వేతా, ఆదర్శ్, సునంద ముగ్గురూ కలిసి మాట్లాడుకునేసరికి శేఖర్ మాస్టర్ కి కోపం వచ్చింది. అలా ముగ్గురు కలిసి ఎలిమినేట్ చేయడం కాదు ఇండివిడ్యువల్ గా ఎలిమినేట్ చేయాలి అని చెప్పాడు. ఐతే సహృద మాత్రం ఫుల్ టెన్షన్ పడిపోతూ కనిపించింది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.