English | Telugu

సునంద మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన ఆది...

ఢీ ఈ వీక్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఆది కూరగాయలు అమ్మేవాడి గెటప్ లో వచ్చాడు. ఆ పక్కనే సునంద చేపలు అమ్ముతూ ఉంది. ఆమె దగ్గరకు వచ్చి చేపల వ్యాపారం అక్కడినుంచి తీసేయాలని వార్నింగ్ ఇచ్చాడు.

వినకపోయేసరికి ఆమె జుట్టు పట్టుకుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయాడు. ఇక బాడీ బిల్డర్ లా ఉండే సునంద ఊరుకుంటుందా..రా ఆది పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం అని ఆదిని పక్కకు తీసుకెళ్లి "ఎం నేను పట్టుకోలేనా" అంటూ ఆది జుట్టును గట్టిగా పట్టేసుకుంది. దాంతో ఆది పరువు పోయింది..గట్టిగా ఆమె మీద అరిచాడు. "భూమికి బెత్తెడున్నావ్ నువ్వు నా మీద చెయ్యెత్తుతావా" అంటూ స్టేజి మీద ఒంగోబెట్టి ఉతికారేసింది. ఆది జుట్టు పట్టుకుని పచ్చిమిరపకాయల్ని నోట్లో కుక్కి మరీ బాదిపారేసింది. ఇక పూలమ్మే పిల్లగా వర్షిణి కనిపించేసరికి ఆమెకు బిస్కెట్లు వేయడానికి ఆది ట్రై చేసాడు. "నీకు పెళ్లయిపోయింది..ఏమన్నా మాట్లాడదామంటే.. మీ అమ్మగారు ఇక్కడే సెట్ లో ఉంటారు. ఛ..సర్లే గాని టచ్ లో ఉండు" అని పంపించేశాడు..ఇక ఆది నడుపుతున్న తోపుడు బండి మీద చాలా కూరగాయలు ఉండేసరికి శ్వేతా నాయుడుకు ఒక డౌట్ వచ్చింది. "ఆది ఇంతకు మీ ఇంట్లో ఎం కూర" అని అడిగింది. "మునక్కాయ కూర తినొచ్చా" అని ఆది చెప్పేసరికి "ఐతే నీకు దూరంగా ఉండాలి" అని శ్వేతా పక్కకు వెళ్ళిపోయింది. "వంద కేజీల మునక్కాయలు తిన్నా కూడా నేను నీ దగ్గరకు రాను టెన్షన్ పడకు" అన్నాడు ఆది. "అసలు నీ ఆకారం చూసుకున్నావా నువ్వు ఎలా ఉన్నావో" అని రివర్స్ లో శ్వేతా అడిగింది. " ఆది ఇక్కడ" అని బిల్డప్ ఇచ్చేసరికి "ఐతే ఏది" అని డబుల్ మీనింగ్ డైలాగ్ వేసేసింది శ్వేతా.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.