Home

»

Tv News

అమెరికాలో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆడిషన్స్!

Apr 27, 2024

 

బుల్లితెర మీద మంచి రేటింగ్ ని సొంతం చేసుకునే షో సింగింగ్ రియాలిటీ షో అదే  ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌తో ఆడియన్స్ ని అలరించింది. ఇప్పుడు సీజన్ 3 తో త్వరలోనే మన ముందుకు రాబోతోంది. అందులో భాగంగా ఆడిషన్ డేట్స్ కూడా వచ్చేసాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఈ మెసేజ్ ని పోస్ట్ చేసింది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కోసం మొదటిసారి అమెరికాలో వీటిని నిర్వహిస్తున్నారు.  

న్యూజెర్సీలో మే 4న టీవీ9 యుఎస్ఏ స్టూడియోస్,399 హూస్ లేన్, 2న ఫ్లోర్ పిస్కాట్ అవే .. అలాగే డల్లాస్‌లో మే 11న కాకతీయ లాంజ్ 4440 హెచ్.డబ్ల్యువై 121 , లెవీస్ విల్లే, టెక్సాస్, యుఎస్ఏ, సూట్ - 5 లో ఆడిషన్స్ జరగనున్నాయి. రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మూడో సీజన్ ను ప్రారంభించడానికి ఆహా ఓటీటీ ప్లాన్ చేస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1లో మొత్తం 12 మంది, రెండో సీజన్లో మొత్తం 13 మంది పార్టిసిపేట్ చేశారు. తొలి సీజన్లో సింగర్ శ్రీరామచంద్ర, రెండో సీజన్లో సింగర్ హేమచంద్ర హోస్టులుగా వ్యవహరించారు. మొదటి  సీజన్ లో  విజేతగా నెల్లూరుకు చెందిన వాగ్దేవి, రెండవ సీజన్ లో  న్యూ జెర్సీ కి చెందిన శృతి నండూరి గెలిచారు. ఈ షోకి దేవిశ్రీప్రసాద్, అల్లు అర్జున్, నాని, బాలకృష్ణ, ఎస్పీ చరణ్, చంద్రబోస్, స్మిత వంటి వాళ్ళు వచ్చారు. #ఎట్లిచ్చినం అనే హ్యాష్ ట్యాగ్ తో రాబోతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com