English | Telugu

'కార్తీక దీపం'ను దాటేసి టాప్ 1 ప్లేస్‌లో 'గుప్పెడంత మనసు'!

స్టార్ మాలో వచ్చే సీరియల్స్‌ని ఆదరించని ఆడియన్స్ లేరు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్ తమదైన శైలిలో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే ఎలాంటి సీరియల్‌నైనా ఆదరిస్తారు ప్రేక్షకులు. ఇకపొతే స్టార్ మాలో ప్రసారమయ్యే ధారావాహికలకు ఎక్కువ రేటింగ్ కూడా వస్తూ ఉంటుంది.

ఇందులో ప్రసారమయ్యే కార్తీక దీపం, ఇంటింటి గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, త్రినయని.. ఇలాంటి ఎన్నో సీరియల్స్ మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్నాయి. ఈ రేటింగ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అందులోనూ ఎన్నో కొత్త కొత్త సీరియల్స్ కూడా లైన్ లోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఐతే ఇప్పుడు సాయికిరణ్ తాను నటిస్తున్న "గుప్పెడంత మనసు" సీరియల్ ప్రస్తుతం అర్బన్ మార్కెట్స్ లో టాప్ 1గా 9.77 రేటింగ్‌తోనిలిచింది.. అంటూ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో పెట్టుకుని మురిసిపోతున్నారు.

ఇక ఆ లిస్ట్ చూస్తే.. టాప్ 2లో కార్తీక దీపం (9.62), టాప్ 3లో త్రినయని (8.75), టాప్ 4లో ఇంటింటి గృహలక్ష్మి (8.59), టాప్ 5లో పడమటి సంధ్యారాగం (7.97) రేటింగ్‌తోతో ముందుకు దూసుకెళ్తున్నాయి.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.