English | Telugu

Guppedantha Manasu: శైలేంద్రకి మను వార్నింగ్.. జస్ట్ మిస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 1115 లో .. రౌడీలను చితక్కొట్టి నేరుగా శైలేంద్ర దగ్గరకు మను వెళ్తాడు. వీడు ఇంకా చనిపోలేదా? అని శైలేంద్ర చూస్తాడు. దాంతో మను.. ఏంటీ.. అలా చూస్తున్నావ్.. వీడింకా చనిపోలేదేంటనా? నువ్వు కాదు కదా.. నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా నన్నేం చేయలేవని మను అంటాడు. ఆ మాటతో శైలేంద్ర.. నువ్వేం మాట్లాడుతున్నావ్ మను.. చనిపోవడం, బతకడం ఏంటి? నీకు మతిపోయిందా అని అంటాడు. అబ్బా ఏం యాక్ట్ చేస్తున్నావ్.. ఒక్కసారి అటు చూడు అంటూ తనని చంపడానికి పంపిన రౌడీలను చూపిస్తాడు. వాళ్లు గేటు బయట చేతులు కట్టుకుని లైన్‌లో నిలబడి ఉంటారు. వాళ్లని చూసిన శైలేంద్ర షాకవుతాడు. రేయ్ చెత్త వెధవల్లారా.. మీరు దొరికిపోయి.. నన్ను ఇరికించార్రా అని శైలేంద్ర అనుకుంటాడు. వాళ్లని పంపించింది నువ్వే కదా అని మను అడుగుతాడు.

హా అవునూ.. నేనే పంపించా.. అయితే ఏంటిప్పుడు అని శైలేంద్ర అంటాడు. అబ్బే ఏం లేదు.. నువ్వు చేయాల్సింది నువ్వు చేశావ్ కదా.. ఇప్పుడు నేను చేయాల్సింది నేను చేస్తానని మను అంటాడ. నువ్వు నన్నేం చేయలేవ్.. నువ్వు నా దారికి అడ్డొస్తున్నావ్.. మర్యాదగా అడ్డుతప్పుకో.. ఈసారికి మిస్ అయ్యింది.. ప్రతిసారీ మిస్ అవ్వదని గుర్తుపెట్టుకో.. ప్రాణంపై ఆశ ఉంటే నా మాట విను అని శైలేంద్ర అంటాడు. ఆ మాటతో మను.. ప్రాణాలకు భయపడే రకాన్ని కాదు.. మెడలు వంచి నీ గుండెల్లో దడ పుట్టించే రకాన్ని అని‌ మను అంటాడు. డైలాగ్‌లు కాదు బ్రదర్.. బరిలోకి దిగి చూడు.. ఈ శైలేంద్ర ప్రతాపం ఏంటో తెలుస్తుంది అని అంటాడు. నీలాగ దొంగదెబ్బ కొట్టే రకం కాదు.. ఏదైనా స్టైట్‌గానే చేస్తా అని మను అనగా.. అసలు నువ్వు ఎందుకొచ్చావ్ రా అని శైలేంద్ర అనడంతో.. నీ తండ్రి ఫణీంద్రకి నీపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా.. నువ్వు నాపై ఎటాక్ చేయించావని ఫణీంద్ర సర్‌ కి చెప్తా.. ఒక్కసారి అటు చూడంటూ.. అప్పుడే ఇంటి నుంచి ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తున్న ఫణీంద్ర‌ని చూపిస్తాడు మను. దాంతో శైలేంద్ర.. నువ్వు చెప్తే మా డాడీ నమ్మకుండా ఉండటానికి నా ప్లాన్‌లు నాకు ఉన్నాయి.. పోయి చెప్పుకో.. ఇక్కడున్నది శైలేంద్ర భూషణ్ అని గుర్తు పెట్టుకో’ అని అంటాడు. దాంతో మను.. హో.. మరి ఆ రౌడీలు వచ్చి చెప్పినా నమ్మరా అని అంటాడు. ఆ మాటతో శైలేంద్ర నోట మాటరాదు. చెప్పు బ్రదర్.. మీ డాడీ ఇప్పుడు నమ్ముతారా నమ్మరా అని మను అంటాడు మను. దాంతో శైలేంద్ర.. నమ్ముతారు.. నమ్ముతారు.. సారీ బ్రదర్.. సారీ.. నేను తప్పుచేశాను. మా డాడీకి చెప్పకు.. ఏం చెప్పొద్దు బ్రదర్.. ఈ విషయం ఆయనకి చెప్తే నన్ను చంపేస్తారని శైలేంద్ర రిక్వెస్ట్ చేస్తాడు. నీ తప్పుడు పనుల్ని నీ తండ్రితో చెప్పాల్సిందేనని ఫణీంద్ర దగ్గరకు మను వెళ్లబోతుండగా.. ప్లీజ్ బ్రదర్.. నీ కాళ్లు పట్టుకుంటా చెప్పొద్దని అంటాడు. ఇంతలో ఫణీంద్ర వచ్చి.. హాయ్ మనూ.. నువ్వెప్పుడు వచ్చావని వస్తాడు. ఇప్పుడే వచ్చాను సర్ అంటూ శైలేంద్ర భుజంపై చేయి వేసి నవ్వుతాడు మను. దాంతో శైలేంద్ర చెప్పొద్దు ప్లీజ్ అంటూ కనుసైగలు చేస్తాడు. ఏంటి మను.. మా వాడు ఏదైనా వెధవ వేషాలు వేస్తున్నాడా? చెప్పు మనూ తాట తీస్తానని ఫణీంద్ర అంటాడు.

హయ్యో డాడీ.. అలాంటిదేమీ లేదు.. మేమ్ సరదాగా మాట్లాడుకుంటున్నాం అంతే అని శైలేంద్ర అంటాడు . వీడు చెప్పేది నిజమేనా మనూ.. ఏం లేదా అని ఫణీంద్ర అడుగుతాడు. అవును సర్.. ఏం లేదు.. క్యాజువల్‌‌గానే మాట్లాడుకుంటున్నామని మను అంటాడు. తప్పైపోయింది.. నన్ను క్షమించమంటూ మను ముందు గుంజీలు తీసేస్తాడు. నువ్వేం చేయమంటే అదే చేస్తాను బ్రదర్.. కానీ ఈ విషయం మాత్రం మా డాడీతో చెప్పొద్దు బ్రదర్.. బుద్దొచ్చింది.. ఇక మారతాననని అంటాడు. అదీ లెక్క.. భయం అంటే ఏంటో తెలిసిందా?? ప్రతిక్షణం.. ఇలాగే భయపడుతూ ఉండు.. ఒకవేళ తోకజాడిస్తే.. మరుక్షణమే నీ తోక కట్ చేస్తానంటూ శైలేంద్రకి మను వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.