English | Telugu

Brahmamudi :  లైవ్ లో ఇంటిగుట్టు బయటపెట్టేసిన అనామిక.. వాళ్ళిద్దరు ఎమోషనల్!

స్టార్ మా‌ టీవీలో‌ ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'. ఈ సీరియల్ ‌సోమవారం నాటి ఎపిసోడ్-450 లో.. అనామిక న్యూస్ ఛానెల్ లో డిబేట్ లో కూర్చుంటుంది. అనామిక అనే ఆడపిల్ల జీవితాన్ని ఆ దుగ్గిరాల ఫ్యామిలీ నాశనం చేసింది. అందరిలానే పెళ్లి గురించి, కాపురం గురించి కలలు కన్న అనామిక జీవితంలో చీకటి అలుముకుంది. దానికి కారణం ఆమె భర్త దుగ్గిరాల కళ్యాణ్.. అతడి తన ప్రియురాలు అప్పూ మాయలో పడి అనామికతో విడిపోవడానికి కళ్యాణ్ సిద్ధపడ్డాడు. ఈ దయనీయమైన కథని చూస్తూనే ఉండండి అంటూ సుకన్య ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది.

ప్రస్తుతం అనామిక గారితో పాటు ఉమెన్స్ వెల్ఫేర్ సంస్థ సభ్యురాలు శ్రీమతి ఝాన్సీ గారు కూడా మన స్టూడియోలోనే ఉన్నారు.. అనామిక గారు మాట్లాడండి అని యాంకర్ సుకన్య అంటుంది. దాంతో అనామిక అందుకుంటుంది. కళ్యాణ్ గొప్పింటి వాడే కానీ.. సంస్కారం తెలియదు. వాళ్లకు ఎన్ని కంపెనీలు ఉన్నా తను మాత్రం ఉద్యోగం చెయ్యడు. తింటాడు ఆ అప్పూతో కలిసి తిరుగుతాడు. వాళ్లిద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా హోటల్ రూమ్‌లో దొరికేసినా సరే తప్పు అంతా నాదే అని నిందలు వేశాడు కళ్యాణ్.. అతడి ఫ్యామిలీ కూడా అతడినే సపోర్ట్ చేసిందని అనామిక చెప్తుంది . పడకగదిలో నాకు నరకం చూపిస్తాడు ఆ కళ్యాణ్. అదే విషయం ఇంట్లో అందరికి చెప్పినా ఎవ్వరూ నా తరపు నిలబడలేదు. పైగా విడాకులు కావాలని ఈ మధ్య టార్చర్ మొదలుపెట్టాడు నా భర్త.. ఇదిగోండి విడాకుల పత్రాలు అంటూ అనామిక డైవర్స్ పేపర్స్ చూపిస్తుంది. ఇటు దుగ్గిరాల ఫ్యామిలీ.. అటు కనకం ఫ్యామిలీ టీవీలో అనామిక మాట విని, చూసి షాక్ అవుతారు. ఇక ఝాన్సీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఏమ్మా అనామిక.. నీ పెళ్లి అయ్యి ఎంత కాలం అయ్యిందని ఝాన్సీ అడుగగా.‌‌. నాలుగైదు నెలలు అయ్యింది మేడమ్ అని అనామిక అంటుంది. ప్రేమ పెళ్లా పెద్దలు కుద్చిన పెళ్లా అని ఝాన్సీ అడుగగా.. అవును మేడమ్.. మొదట ప్రేమించుకున్నాం.. తర్వాత పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నామని అనామిక అంటుంది. మరి ప్రేమించినప్పుడు కళ్యాణ్ ఏం చెయ్యకుండా ఖాళీగా ఉంటాడని తెలియదా? అని ఝాన్సీ అంటుంది. తెలుసు. కవిత్వం రాసుకునేవాడు. అది చూసే ప్రేమించానని అనామిక చెప్తుంది.

పెళ్లి అయ్యాక కవిత్వం నచ్చలేదా? కవిత్వం రాసే మనిషి నచ్చలేదా? కవిత్వం రాయడం కళ మాత్రమే కాదు.. అది కూడా ఓ విద్యేనని నీకు తెలియదా అని ఝాన్సీ అడుగగా.. తెలుసు.. కానీ బిజినెస్ చూసుకోమంటే చూసుకోవడం లేదు.. అయిన మేడమ్... నేను ఇప్పుడు కేవలం నా కాపురం గురించి చర్చించడానికి మాత్రమే వచ్చానని అనామిక అంటుంది. ఇక కళ్యాణ్, అప్పులు రెడ్ హ్యాండెండ్ గా హోటల్ లో దొరికిందని , ఈ టీవీలోనే వచ్చిందని సీసీటీవీ ఫుటేజ్ చూపించగా ఝాన్సీ షాక్ అవుతుంది. ఆ తర్వాత అనామికకి సపోర్ట్ చేస్తుంది. మరోవైపు ఈ డిబేట్ చూస్తున్న దుగ్గిరాల ఫ్యామిలీ, కనకం ఫ్యామిలీ షాక్ లో ఉంటారు. ‌దుగ్గిరాల వారు కళ్యాణ్ వైపు జాలిగా చూస్తుంటే.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరూ అప్పూ వైపు జాలిగా చూస్తారు. పచ్చగా పండదు ఈ నేల.. బతుకులా ఉండదు ఏ వేళ.. ముల్లను తెచ్చి నాటాక మల్లెలు పూస్తాయా అంటూ ఎమోషనల్ సాంగ్ మొదలవుతుంది. కళ్యాణ్, అనామిక ఎవరికి వారు ఒంటరిగా బాధపడుతూ ఆలోచిస్తూ కన్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.