English | Telugu

అత్త తెలివికి‌ పరీక్ష పెట్టిన కోడలు.. భర్తకి కూడా అది తెలియదంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1084 లో.. దేవయాని కూర్చొని ఆలోచిస్తుంటే.. ధరణి వచ్చి దేనిగురించి ఆలోచిస్తున్నారని అడుగుతుంది. ధరణి ఏదో చెప్పబోయి ఆగిపోతుంది. నన్ను ఏమైనా తిట్టబోయావా అని దేవయాని అడుగుతుంది. అదేం లేదని ధరణి అంటుంది. నువ్వు ఒక తెలివి తక్కువ దానివి అని ధరణిని దేవయాని అంటుంటే.. లేదు అత్తయ్య, నేను చాలా తెలివిగలదాన్ని అని ధరణి అంటుంది.

నీక్కూడా తెలివి ఉందా అని దేవయాని అనగానే.. నేనొక పొడుపు కథ చెప్తాను దానికి సమాధానం చెప్పాలని ధరణి అంటుంది. అడుగు చెప్తానని దేవయాని అంటుంది. అంగట్లో అమ్మేది కాదు తక్కేట్లో పెట్టి తూచిది కాదు.. అది లేకపోతే మనిషే కాదు అని ధరణి పొడుపుకథ చెప్తుంది. ఇది మీరు చెప్పలేదు మీ అబ్బాయి వచ్చాక తనకి తెలుసేమో అడగండి అని ధరణి అంటుంది. నేను చెప్తానంటూ పొడుపు కథ గురించి దేవయాని ఆలోచిస్తుంటుంది. మరొకవైపు జైల్లో ఉన్న రాజీవ్ ని శైలేంద్ర కలుస్తాడు.‌ నిన్ను పోలీసులకి పట్టించింది ఎవరని‌ రాజీవ్ ని శైలేంద్ర అడుగుతాడు.. ఇంకెవరు ఆ వసుధార, మహేంద్రలు అని రాజీవ్ అనగానే.. హమ్మయ్య నేనని అనుకోవట్లేదని శైలేంద్ర అనుకుంటాడు. శైలేంద్ర గుచ్చి గుచ్చి అడుగుతుంటే.. అసలు దీని వెనకాల వాళ్ళు కాకుండా ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వాళ్ళు ఎవరో నువ్వు కనుక్కోమని శైలేంద్రతో రాజీవ్ అంటాడు. ఒకవేళ తెలిస్తే ఏం చేస్తావని శైలేంద్ర అడుగగా.. చంపేస్తానని రాజీవ్ అంటాడు.‌ దీని గురించి తర్వాత మాట్లాడుతానంటూ శైలేంద్ర కంగారుగా వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత పొడుపు కథ గురించి ఆలోచిస్తున్న దేవయాని దగ్గరికి శైలేంద్ర వస్తాడు. దాంతో‌ శైలేంద్రకి ధరణి చెప్పిన పొడుపు కథ గురించి దేవయాని అడుగుతుంది. నాకు తెలియదని శైలేంద్ర అంటాడు. అప్పుడే ధరణి వస్తుంది. దానికి సమాధానం చెప్పమని ధరణిని శైలేంద్ర అడుగుతాడు. చెప్పనంటూ ధరణి అంటుంది. రాజీవ్ ని కలిసాను.. వాడికి నేనే పట్టించానని తెలియదని దేవయానితో శైలేంద్ర చెప్తాడు. మరోవైపు శైలేంద్ర మాటలని మను గుర్తుకుచేసుకుంటాడు. మీరు శైలేంద్ర మాటలు పట్టించుకోకండి అని వసు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.