English | Telugu

నా కడుపులోని బిడ్డకి తండ్రి మురారీనే.. సూపర్ ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి' (Krishna Mukunda Murari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -479 లో.. మీరా కల్లు తిరిగి పడిపోవడంతో తనని చూడడానికి డాక్టర్ ని తీసుకొస్తారు. మీరా ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో ఇంట్లోని వాళ్ళంతా షాక్ అవుతారు. ఇక ఆదర్శ్ కోపంతో ఊగిపోతాడు. ఆదర్శ్ దగ్గరికి భవాని వెళ్ళి .. చెంపచెల్లుమనిపిస్తుంది. ఎంత పని చేశావ్ ఆదర్శ్.. నీకు ఇష్టం ఉందనే కదా పెళ్ళి చేస్తామని చెప్పాం..‌ కానీ పెళ్ళికి ముందే ఇలా చేయం తప్పు అని ఆదర్శ్ పై భవాని ఫైర్ అవుతుంది.

ఇక ఆదర్శ్ ని భవాని ఎడాపెడా తిడుతుంది. కానీ అదర్శ్ మాత్రం ఎమోషనల్ అవుతాడు. మీరా కడుపులోని బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆదర్శ్ చెప్పడం మొదలెడతాడు. నేను నీ కొడుకుని.. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను అమ్మ‌.. నాకు‌ ఆ కడుపుకి ఏం సంబంధం లేదని అదర్శ్ చెప్తాడు. దాంతో భవానికి బుర్రపాడవుతుంది. నేను ఇష్టపడ్డ ముకుంద నాకు దూరం అయింది.. మీరాని పెళ్ళి చేసుకుందామంటే ఇలా జరిగింది నా జాతకమే ఇంతా అని ఆదర్శ్ బాధపడుతూ వెళ్ళిపోతాడు.‌ భవానికి ఏం చేయాలో తోచదు. మరోవైపు కృష్ణ తన పుట్టింట్లో ఉన్నా ఫుల్ టెన్షన్ పడుతుంది. ఇక అప్పుడే ప్రభాకర్ అతని భార్య కలిసి రకరకాల పండ్లు తీసుకొని కృష్ణ దగ్గరికి వస్తారు. కృష్ణ చూసి భాదపడుతుంది. ఎందుకు కన్నీళ్ళు.. నిజం చెప్పు అని ప్రభాకర్ అడిగితే మాట దాటవేస్తుంది కృష్ణ. ‌ఏం లేదని.. మీరు చూపించే ప్రేమకు కన్నీళ్ళు వస్తున్నాయని కృష్ణ కవర్ చేస్తుంది.

ఇక మరోవైపు ఇంట్లో అందరు ఒక షాక్ లో ఉంటారు. అసలు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరని అందరు కలిసి మీరా అలియస్ ముకుందని నిలదీసేసరికి.. ఈ ఇంటి వారసుడి రక్తం నా కడుపులో పెరుగుతుందని మీరా అంటుంది. దాంతో అందరు మధు వైపు కోపంగా చూస్తారు. దాంతో నాకేం సంబంధం లేదని మధు అంటాడు. ఎవరని భవాని ప్రశ్నించగా.. మురారి అని మీరా చెప్పేస్తుంది. దాంతో ఆదర్శ్ కుప్పకూలిపోతాడు. ఇక మురారి కోసం మధు ఇల్లంతా వెతికి వచ్చి.. లేడని చెప్తాడు. ఇంకేముంది పారిపోయి ఉంటాడని ఆదర్శ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. నా కొడుకు అలాంటివాడు కాదని రేవతి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో చూసుకొని మాట్లాడమని మధు అంటాడు. అసలు మురారి ఎటు వెళ్ళాడు? మీరానే ముకుంద అనే నిజాన్ని కృష్ణ బయటపెట్టగలదా.. భవాని ఏం చేయనుంది లాంటి మలుపులతో ఈ సీరియల్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అసలేం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.