English | Telugu

Guppedantha Manasu : కొడుకు కోసం తల్లి కన్నీటి పర్యంతం.. నాన్నెవరో చెప్పగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1079 లో.... మనుని మహేంద్ర ఇంటికి తీసుకొని వస్తాడు. మనుని చూసిన అనుపమ ఎమోషనల్ అవుతుంది. మనుతో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఇప్పటికైన మనుతో మాట్లాడండని అనుపమతో వసుధార అన్నా కూడా అనుపమ సైలెంట్ గా ఉంటుంది. ఆవిడ ప్రేమ, కోపం, ఆవేశం అంతా నాకు తెలుసు కానీ ఒకే ఒక ప్రశ్నకి సమాధానం తప్ప.... ఆ ప్రశ్న నా తండ్రి ఎవరు అనేది.. ఆవిడా చెప్పదు.. అది నాకు అర్థం కాదు.. మేడమ్ మీరు నా గురించి ఆలోచించకండి నేను బాగుంటానని అనుపమతో మను అంటాడు.

మీలాంటి మనుషులని ఎప్పుడు చూడలేదు.. మీతో నాకు ఎలాంటి బంధుత్వం లేదు అయిన నా కోసం ఇంత హెల్ప్ చేశారని మను అనగానే.. నేనేం చెయ్యలేదు అంత మీ నాన్నగారు ముందుండి నడిపించారని వసుధార అనగానే అందరు షాక్ అవుతారు. అంటే మిమ్మల్ని దత్తత తీసుకొని తండ్రి స్థానంలోకి రావాలనుకున్నారు కదా అందుకే అని వసుధార కవర్ చేస్తుంది. వసుధార నువ్వేం తప్పు అన్లేదు నిజమే కదా.. ఇప్పుడు మళ్ళీ దత్తత తీసుకుంటానని మహేంద్ర అనగానే.... మీరు నా తండ్రిలాగా ఈ విషయంలో హెల్ప్ చేశారు కానీ ఆ స్థానంలోకి మీరు రావద్దు.. నాకు తండ్రిపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసు కదా... కానీ మీలాంటి తండ్రి ఉంటే ఆ కొడుకు ఏదైనా సాధించగలడని మను అంటాడు.. ఆ తర్వాత రాజీవ్ ని శైలేంద్ర కలిసినట్టు.. నన్ను ఇంత మోసం చేస్తావా అని శైలేంద్ర తలకి రాజీవ్ గన్ పెట్టినట్టు.. వద్దు నన్ను క్షమించని తన కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేసినట్టు ఉహించుకుంటాడు.. కానీ శైలేంద్ర ధరణి కాళ్ళు పట్టుకొని అదంతా ఊహించుకుంటే.. ఫణీంద్ర చూసి.. ఏం చేస్తున్నావంటూ అడుగుతాడు. శైలేంద్ర ఊహలో నుండి బయటకు వచ్చి లేస్తాడు. ఎందుకిలా చేస్తావంటూ ఫణీంద్ర కోప్పడతాడు..

ఆ తర్వాత వసుధార, అనుపమ ఇద్దరు మాట్లాడుకుంటారు. మనుని నేను చాలా బాధపెడుతున్నానంటూ అనుపమ చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది. అదంతా మను వింటాడు. ఆ తర్వాత మనుకి శైలేంద్ర ఫోన్ చేసి.. మీరు చెప్పింది చేస్తారు కదా అని మనుతో అంటాడు. ఎక్కడ ఉన్నావని శైలేంద్ర అనగానే.. మహేద్ర సర్ ఇంట్లో అని మను చెప్తాడు. అక్కడ ఉంటే.. ఎక్కడ మను మనసు మారుస్తారోనని.. మీరు అక్కడ నుండి వెళ్ళండి అని మనుతో శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.