English | Telugu

Guppedantha Manasu: ఆమె ప్లాన్ సక్సెస్.. పదవికోసం అతను మనుని బయటకు తీసుకొస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1071 లో.. రాజీవ్ ని వసుధార చూడగానే తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఒక దగ్గర కూర్చొని ఛ అనవసరంగా వసుధారకి కన్పించాను.. ఇప్పుడు ఆ విషయం అందరికి చెప్తుంది. ఆ నోటా ఈ నోటా తెలిసి ఆ శైలేంద్ర కి తెలుస్తుందని రాజీవ్ టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే రాజీవ్ కి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. రాజీవ్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో మళ్ళీ ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేసినట్టున్నాడని శైలేంద్ర అనుకుంటాడు.

ఆ తర్వాత శైలేంద్రకి ఒక ఎంప్లాయి ఒక నోటీస్ తీసుకొని వచ్చి.. ఆ మను పంపించాడని చెప్పగానే వాడు స్టేషన్ లో ఉన్నాడు కదా.. వాడెలా పంపిస్తాడని శైలేంద్ర అంటాడు. నోటీస్ ఓపెన్ చేసి చూడగానే.. నాకు ఇవ్వాల్సిన యాభై కోట్లు ఇవ్వకుంటే కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని ఆ నోటీసులో ఉంటుంది. అది చూసి మనుపై శైలేంద్ర కోప్పడతాడు. అప్పుడే మహేంద్ర, వసుధార ఇద్దరు వచ్చి.. ఏంటని అడుగుతారు.. ఆ నోటీస్ చూడగానే మహేంద్ర, వసుధార ఇద్దరు షాక్ అయినట్లు యాక్ట్ చేస్తారు. ఈ మను ఎంత మోసం చేసాడని మహేంద్ర అంటాడు.. అతను అలా చేసేవాడు కాదు మావయ్య.. ఇందులో ఎదో ఉందని వసుధార అంటుంది. ఏముంది వాడు ఎలాంటి వాడో నాకు తెలుసని శైలేంద్ర అంటాడు. మనుని వెళ్లి కలిసి ఇదేంటని అడగాలని వసుధార అనగానే.. మీరెందుకు నేనే వెళ్లి నీలదీస్తానంటూ శైలేంద్ర ఒక్కడే వెళ్తాడు.

ఆ తర్వాత శైలేంద్ర స్టేషన్ కి వెళ్లి మనుతో మాట్లాడుతాడు. ఏంటి ఇది అని అడుగుతాడు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు అడుగుతున్నానని మను అనగానే.. నువ్వు ఆ రోజే చెక్కు చింపేశావ్ కదా అని శైలేంద్ర అంటాడు. ఆ విషయం నీకు తెలుసు.. నాకు తెలుసని మను అంటాడు. రాజీవ్ బ్రతికి ఉన్నాడని తెలుసు.. నన్ను ఈ కేసు నుండి బయటపడేస్తే, నీకు ఎండీ పదవి ఇస్తాను.. ఎలాగు వసుధార వాళ్ళు నేను అడిగిన డబ్బులు ఇవ్వలేరు.. కాలేజీ నా సొంతం అవుతుంది. అప్పుడే నీకు నచ్చిన పదవి ఇస్తానని శైలేంద్రకి మను చెప్తాడు. ఆఫర్ ఇస్తున్న డిసైడ్ చేసుకోమని మను అంటాడు.. ఆ తర్వాత శైలేంద్ర వెళ్లిపోతుంటే.. అక్కడ కానిస్టేబుల్ శైలేంద్రతో మాట్లాడతాడు. తన కోసం చాలా మంది వస్తున్నారని చెప్పగానే.. నాకు ఎవరు వచ్చినా.. మాట్లాడినా చెప్పమని అతనితో శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత శైలేంద్ర కాలేజీకి వెళ్తాడు. మను నోటీస్ వెనక్కి తీసుకోడంట అని శైలేంద్ర అనగానే.. ఎంత నమ్మాను అంటూ మహేంద్ర యాక్ట్ చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.