English | Telugu

Eto Vellipoyindhi Manasu : ప్రియుడి నిజస్వరూపాన్ని భార్యకి భర్త చెప్పగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -93 లో....అభిని కలవడానికి రాత్రిపూట రామలక్ష్మి వస్తుంది. ఆ తర్వాత తన వెనకాలే సీతాకాంత్ వస్తాడు. తనని చూసిన అభి కావాలనే.. నువు రేపు ప్రెస్ మీట్ లో మాట్లాడు అని చెప్తాడు.. ఇంకా కొన్నిరోజుల తర్వాత అంతా సెట్ అయ్యాక నిన్ను తీసుకొని వెళ్తానని అభి అంటాడు. ఆ తర్వాత అభి రామలక్ష్మిని కార్ దగ్గరకి పంపిస్తాడు.

నేను చెప్పిన డిలింగ్ కి ఒప్పుకొని నన్ను సెటిల్ చెయ్యాలని సీతాకాంత్ తో అభి చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ ని రెచ్చగొట్టేలా అభి మాట్లాడతాడు. నేను చెప్పినట్టు చేయకుంటే మీ అమ్మతో నిజం చెప్తానని అభి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ లు వెళ్ళిపోయాక రేపు ప్రెస్ మీట్ తర్వాత ఇంకా నా గుప్పిట్లోకి వస్తావ్.. ఇంకా రేపు నేను చేసే ప్లాన్ చూడని అభి అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతకాంత్ లు కార్ లో వెళ్తుంటారు. అభి చాలా మంచోడు నన్ను అర్ధం చేసుకుంటాడని అభి గురించి రామలక్ష్మి గొప్పగా మాట్లాడుతుంటే.. అభి నిజస్వరూపం చెప్పాలని అనుకుంటాడు కానీ చెప్పలేకపోతాడు. ఆ తర్వాత సీతాకాంత్ నిద్రపోకుండా అభి అన్న మాటలు గుర్తుకుచేసుకుంటాడు. మరొకవైపు రేపు ప్రెస్ మీట్ లో సీతా సర్ భార్య అని అందరికి తెలిస్తే భవిష్యత్తులో అభితో నన్ను చూస్తే అందరూ ఏమనుకుంటారని రామలక్ష్మి ఆలోచిస్తుంటుంది. ఒక్కసారిగా భయపడుతుంటే.. ఏమైందని సీతాకాంత్ అడుగుతాడు. ఇక ఏం టెన్షన్ పడకని చెప్తాడు.

ఆ తర్వాత సందీప్ ప్రెస్ మీట్ కి అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు. అప్పుడే శ్రీవల్లి ప్రెస్ మీట్ ఉందని బాగా రెడీ అవుతుంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ కి అన్నయ్య కచ్చితంగా వస్తాడని సందీప్ అంటాడు. ఆ రామలక్ష్మి కి ఇబ్బంది కలుగకుండా సీతాకాంత్ ఏం చేస్తాడోనని శ్రీలత అంటుంది. ఆ తర్వాత కిందకి రండి అంటూ సీతాకాంత్, రామలక్ష్మిల దగ్గరకి శ్రీవల్లి వచ్చి చెప్తుంది. కాసేపటికి రామలక్ష్మి, సీతాకాంత్ లు కిందకి వస్తారు. మేమ్ భార్యాభర్తలమని మీడియా ముందు చెప్పామన్నావ్ కదా చెప్పడానికి వచ్చానని శ్రీలతతో సీతాకాంత్ అనగానే.. శ్రీలత షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.