English | Telugu

గుప్పెడంత మనసు‌ సీరియల్ లో మరో విలన్ ఎంట్రీ..!

ఇదేందయ్యా ఇది.. ఇది సీరియలా‌ లేక సినిమానా ఓవైపు ఉన్న విలన్ తోనే హీరో చచ్చేలా ఉన్నాడురా అంటే మరో విలనా.. ఇక అంతే సంగతులు. ఇలా ప్రతీ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది గుప్పెడంత మనసు.

స్టార్ మా‌ టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ‌' గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ లో తాజా ఎపిసోడ్ లలో‌ రిషికి జరిగిన గాయాల‌ నుండి తేరుకోవాలని వసుధార ప్రయత్నిస్తుంటుంది. ఆ కరుడుగట్టిన ‌శైలేంద్ర కంటపడకుండా దూరంగా ‌ఉంచి కంటికిరెప్పలా కాపాడుకుంటుంది. అంతలోనే ఎంట్రీ ఇస్తాడు వసుధార బావ రాజీవ్. చీకటి గదిలో వసుధార ఫొటోని చూస్తూ.. ‘ఆటలాడుకోవడం నీకే కాదు మరదలు పిల్లా.. నాకూ వచ్చు.. ఏంటి వసుధార ఇదీ.. ఈ బావని దెబ్బకొట్టి వాడ్ని పెళ్లి చేసుకుంటే ఎలా చెప్పు?? ఏమి అందం.. ఏమీ అందం.. అని వసుధార ఫొటోపై చేయి వేసి తన సైకోయిజాన్ని చూపిస్తుంటాడు రాజీవ్. నిన్ను వదల్లేకపోతున్నాను వసూ.. ఇప్పటికే నిన్ను పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిన నేను ఏడాదిగా కనిపించకుండా పోయాను. ఈ కొత్త సంవత్సరంలోనైనా నిన్ను నా దాన్ని చేసుకోవాలని వచ్చాను.. కానీ నువ్వు ఆ రిషి గాడ్ని పెళ్లి చేసుకున్నావని తెలిసింది. వెరీ బ్యాడ్.. వెరీ బ్యాడ్.. ఏంటి మరదల పిల్లా ఇదీ.. నువ్వు ఇలా చేసేముంది నీపైనే ఆశలు పెట్టుకున్న ఈ బావ గురించి ఆలోచించవా? అయినా నాలో లేనిది ఏంటి? వాడిలో ఉన్నది ఏంటి? నేను రా.. రా అంటే నాతో రావాలి కానీ వాడితో పోయావేంటి? ఇదే బాలేదు మరదలా.. అసలు ఈ బావని ఒంటరిని చేసి నువ్వు వాడితో వెళ్లిపోవడం న్యాయం కాదు. నువ్వే నా దిల్. నిన్ను పెళ్లి చేసుకోవడమే నా కర్తవ్యం.‌నువ్వు ఎవడితోనే ఉంటే వదిలేస్తానా?? అందుకే మళ్లీ వచ్చాను.. కథలోకి ఎంట్రీ ఇచ్చాను.

గుప్పెడంత మనసు సీరియల్ లో కొంతకాలం క్రితం వరకు శైలేంద్ర లేడు. అంతకముందు మెయిన్ విలన్ గా వసుధార వాళ్ళ బావ ఉండేవాడు. వాడి టార్చర్ భరించలేకపోయేది వసుధార.‌ అప్పట్లో రాజీవ్ వచ్చాడంటే ఆ రావణాసురుడే వచ్చాడే అని ఈ‌ సీరియల్ అభిమానులు అనుకునేవారు. అంతలా టార్చర్ చేసిన రాజీవ్ పాత్ర మళ్ళీ వస్తుందంటే ఈ సీరియల్ కి మరింత క్రేజ్ పెరుగుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఇప్పటికే శైలేంద్ర ధాటికి రిషిని కాపడుకోవడంలో మహేంద్ర, వసుధార, అనుపమ అల్లాడిపోతున్నారు. ఇక ఇప్పుడు రాజీవ్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరి మరదలు వసుధార మీద రాజీవ్ కి ఉన్న ఆశని నెరవేర్చుకుంటాడా లేక రిషిని ఎదుర్కోలేక వెనుదిరిగి వెళ్తాడా అనేది రాబోయే ఎపిసోడ్ లలో‌ తెలియనుంది. రాజీవ్ రాకతో‌ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారింది.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.