English | Telugu

Guppedantha Manasu:గుప్పెడంత మనసులో కీలక మలుపు.. అనుపమ 2.0 మొదలైందిగా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -950 లో.. మహేంద్ర దగ్గరికి అనుపమ వచ్చి.. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏంటి ఈ ఎటాక్ లు? కన్పించకుండా పోవడమేంటని అనుపమ అనగానే.. శైలేంద్ర వల్లే ఇదంతా అని అనుపమకి చెప్తే ఇప్పుడే వెళ్లి నిలదీస్తుంది.. చెప్పకపోవడం బెటర్ అని మహేంద్ర సైలెంట్ గా ఉంటాడు.

ఆ తర్వాత వాళ్ళ దగ్గరకి ముకుల్ వస్తాడు. అసలు రిషి ఎప్పటినుండి కన్పించకుండా పోయాడని అడిగి తెలుసుకుంటాడు. నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని ముకుల్ అడుగుతాడు. వర్క్ మీద బయటకు వెళ్లి వస్తాడని అనుకున్నామని మహేంద్ర అంటాడు. అన్నింటికీ లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది. శైలేంద్ర మీద అనుమానం రాగానే అతనిపై ఎటాక్ జరిగిందని ముకుల్ అనగానే.. శైలేంద్రపై అనుమానమేంటని అనుపమ అడుగుతుంది. జగతి మేడమ్ కేసు లో అతనే ప్రధాన నిందితుడని అనుమానం ఉందని ముకుల్ అనగానే అనుపమ షాక్ అవుతుంది. మీరు శైలేంద్ర కండిషన్ ఎలా ఉందో చెప్పండి అనగానే.. చెప్తాను ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తున్నానని మహేంద్ర చెప్తాడు. మరొకవైపు రిషి కోసం వసుధార వెతుక్కుంటూ తిరుగుతుంది. మరొకవైపు అనుపమ, మహేంద్ర ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. హాస్పిటల్ కి వెళ్లగానే.. శైలేంద్ర ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడంటు దేవయానిని అనుపమ అడుగుతుంది. అదేంటి ఎలా ఉన్నాడని? ఏంటి అని ఏం అడగవా డైరెక్ట్ అలా అడుగుతున్నావని దేవాయని అంటుంది. నేను అడిగితే ఏంటి ఆడగకపోతే ఏంటని అనుపమ పొగరుగా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ వచ్చి శైలేంద్రని మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తామని చెప్తాడు.

కాసేపటి తర్వాత మహేంద్రకి వసుధార కాల్ చేస్తుంది. రిషి సర్ ఎక్కడ ఉన్నాడోనని, ఎవరిని అడిగిన తెలియదని అంటున్నారని వసుధార చెప్తుంది. ఆ తర్వాత శైలేంద్ర డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తున్నాడు. నువ్వు డైరెక్ట్ ఇంటికి రా అని మహేంద్ర చెప్తాడు. కాసేపటికి శైలేంద్ర డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. అప్పుడే వసుధార కూడా ఇంటికి వస్తుంది. కావాలనే వసుధారని దిష్టి తియ్యమని దేవయాని చెప్తుంది. ఆ తర్వాత దేవాయనితో వసుధార మాట్లాడుతుంది. ముకుల్ వస్తున్నాడు. ఇక మీ తప్పులు బయటపడతాయంటు దేవయానికి వార్నింగ్ ఇస్తుంది వసుధార. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.