English | Telugu
గౌరవనీయులైన వెధవలకు..అంటూ నెటిజన్స్ పై విజయ్ కార్తీక్ ఫైర్
Updated : Dec 8, 2023
అమర్ దీప్ ఫాన్స్ కి కీర్తి భట్ కి మధ్య సోషల్ మీడియా వార్ ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలుసు. కీర్తి భట్ ఒక వీడియోలో నెటిజన్స్ కి ఘాటు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోబోయే విజయ్ కార్తీక్ కూడా రంగంలోకి దిగాడు. "గౌరవనీయులైన వెధవలు, సన్నాసులు, పోరంబోకులు" అని సంబోధిస్తూ తిట్లు మొదలుపెట్టాడు.
"కీర్తి ఎవరిని సపోర్ట్ చేస్తే మీకేంట్రా, అడగడానికి మీరెవర్రా..నువ్వెందుకు కీర్తికి పర్సనల్ గా మెసేజ్ పెడుతున్నావ్..చెత్త వెధవ ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వలేని వాడు మనిషి కాదు..బిగ్ బాస్ లో కీర్తి సపోర్ట్ చేయగానే వాళ్ళు విన్ ఐపోతారా..యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ చూసేసి కంటెంట్ ఏంటో వినకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటమేమిటి.. ఒకమ్మాయికి నువ్వు చెత్త కామెంట్స్ పెడుతున్నావంటే నీ తల్లిని తిడుతున్నట్టు..నీ తల్లితో నువ్వు ఇలాగే మాట్లాడతావా..ఎదవా, సన్నాసి, అడ్డగాడిద..ప్రత్యేకంగా కామెంట్స్ పెట్టిన వాళ్లకు చెప్తున్నా...ఇలాంటి కామెంట్స్ నువ్వు పెట్టావు అంటే..సైబర్ క్రైమ్ కింద నీ సెల్ ని ట్రాక్ చేసి మూడు నెలలు జైల్లో పెడతారు. అవును తాను మేకప్ ఎంత వేసుకుంటే నీకేంటి..మీ నాన్న మేకప్ కిట్ కొన్నాడా లేదా నువ్వేమన్నా కొనిచ్చావా...గేమ్ ని గేమ్ లా చూడండి. రేపొద్దున్న హౌస్ నుంచి బయటకి వచ్చాక అమరదీప్, శోభా, ప్రియాంక కలిసి తిరుగుతారు.
జాగ్రత్తగా లేకపొతే ఇలాంటి కామెంట్స్ పెట్టి అకౌంట్ డిలీట్ చేసిన సైబర్ క్రైమ్ వాళ్ళు నీ డేటా మొత్తం లాగుతారు. రేపు నువ్వే సోషల్ మీడియాలో ఒక టాపిక్ అవుతావు గుర్తు పెట్టుకో. లాస్ట్ సీజన్ లో కీర్తికి మహేష్, మానస్ తప్ప ఎవరూ సపోర్ట్ చేయలేదు. కీర్తికి ఫామిలీ లేదు కాబట్టి బిగ్ బాస్ టీమ్ వాళ్ళు పిలిచారు కాబట్టే ప్రియాంక వాళ్ళు వచ్చారు..అమ్మాయిల ప్రైవేట్ పార్ట్శ్ గురించి మాట్లాడుతున్నావ్...నువ్వోచ్చిందినువ్వోచ్చింది అక్కడి నుంచే..ఈ ప్రపంచాన్ని చూసింది కూడా అక్కడి నుంచే అని గుర్తుపెట్టుకో అంటూ చెత్త వెధవలు ఘాటు వార్నింగ్ ఇచ్చాడు.