English | Telugu

Gautham Krishna Elimination:గౌతమ్ ఎలిమినేషన్.. ఉల్టా పల్టా ట్విస్ట్ ఉంటుందా?

బిగ్ బాస్ సీజన్-7 ఎన్నడూ లేని విధంగా సాగుతుంది. రోజు రోజుకి కంటెస్టెంట్స్ తమ ఆటతీరుతో ఎవరి అంచనాలకు అందకుండా మారిపోతున్నారు. అడుక్కొని, లాక్కొని,‌ బెదిరించి ఎలాగో అలాగా ప్రతీ టాస్క్ లో ఫైనల్ దాకా వస్తున్నాడు అమర్ దీప్. గత పది వారాలుగా ఫౌల్ ఆడుతు వస్తున్న అమర్.. ఇప్పుడు తన గేమ్ ఆడుతున్నాడని అనాలో లేక శోభాశెట్టి, ప్రియంక కలిసి తనకి చేస్తున్న సపోర్ట్ అనాలో తెలియదు. అయితే ఏ సపోర్ట్ లేకుండా ఉండేది హౌస్ లో‌‌ గౌతమ్, అర్జున్ ఇద్దరే ఉన్నారు.

గత వీకెండ్ లో వచ్చిన నాగార్జున తొక్క బ్యాచ్ అని వీళ్ళకి నామకరణం చేశాడు. అయితే అంబటి అర్జున్ ప్రతీ గేమ్ లో తన వంద శాతం ఇస్తూ మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కానీ శివాజీని నామినేట్ చేసి పెద్ద తప్పు చేశాడు. అదే తనకు ఓట్లు రాకుండా చేశాయని అనడంలో సందేహమే లేదు. ఇక మిగిలింది అశ్వగంధ అలియాజ్ గౌతమ్... హౌస్ లో మోస్ట్ అన్ డిజర్వింగ్ అని ఎవరైన ఉన్నారంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఈ గౌతమ్. హౌస్ లో పన్నెండు మంది హౌస్ మేట్స్ ఉన్నా, ఎనిమిది మంది హౌస్ మేట్స్ ఉన్నా గౌతమ్ కి నామినేషన్ లో గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు శివాజీ. ప్రతీ వారం కారణం లేకుండా సిల్లీ రీజన్స్ తో శివాజీని నామినేట్ చేయడం, కంటెంట్ కోసం వాగ్వాదానికి దిగడం తప్ప ఒక్క గేమ్ లో కూడా గెలిచింది లేదు. ఆట ఆడింది లేదు, యాక్టివ్ పర్ఫామెన్స్ లేదు. ఇంకా ఎంచుకున్నాడంటే ఎలిమినేషన్ అవ్వడానికి ఇతర కంటెస్టెంట్స్ ఉండటమే కారణం లేదంటే నాలుగో వారంలోనే బయటకు వచ్చే కంటెస్టెంట్ గౌతమ్.

ఇక ఈ వారం హౌస్ లో ఏ పర్ఫామెన్స్ లేనిది గౌతమ్. నామినేషన్ లో అతితక్కువ పాయింట్లతో లీస్ట్ లో ఉన్నాడు. అయితే శోభాశెట్టి, ప్రియాంక కూడా లీస్ట్ లోనే ఉన్నారు. కానీ బిగ్ బాస్ సీరియల్ బ్యాచ్ కు ఫేవరిజం చూపిస్తాడని అందరికి తెలిసిందే‌. గత నాలుగు వారాల నుండి శోభాశెట్టి నామినేషన్ లో లీస్ట్ లో ఉన్న తనని బయటకి పంపివ్వలేదు బిగ్ బాస్. ఇక తన బదులు ఇప్పటికే నలుగురు బలైన విషయం తెలిసిందే. ఇప్పుడు మన అశ్వగంధ బలి అవుతాడా లేక బిగ్ బాస్ ఉల్టా పల్టా ట్విస్ట్ ఇచ్చి శోభాశెట్టిని ఎలిమినేట్ చేస్తాడా తెలియాల్సి ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.