English | Telugu

Jayam Serial: శకుంతల మనసు మార్చాలని చూస్తున్న ఇషిక, వీరు.. గంగ ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -149 లో.....గంగ ప్రాణాలకి తెగించి మరి కుటుంబ పరువు కాపాడిందని పెద్దసారు అంటాడు. అప్పుడే గంగని తీసుకొని రుద్ర వస్తాడు. దాంతో పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతు.. ఈ ఇంటి కోడలు వస్తుంది దిష్టి తియ్యండి అని ప్రీతీకి చెప్పగా ప్రీతీ నువ్వు కడుపుతో ఉన్నావ్. నువ్వు తియ్యకని శకుంతల ఆపుతుంది. అయితే ఇందుమతి నువ్వు తియ్ అని పెద్దసారు అంటాడు. తను శకుంతలకి భయపడుతుంది.

మీరు ఎవరు తీయకండి అని పెద్దసారు వెళ్లి గంగకి దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత రుద్ర, గంగ పక్కనే ఉండి తన బాగోగులు చూసుకుంటాడు. తనకి దగ్గర ఉండి టిఫిన్ తినిపిస్తాడు. నేను తింటుంటే ఎవరైనా చూస్తే నాకు దిష్టి తగులుతుందని గంగ అంటుంది. మరి చూడకుండా ఎలా తినిపిస్తారని రుద్ర అంటాడు. అంటే మీరు కాదు అక్కడ అని డోర్ దగ్గరున్న ఇషికని చూపిస్తుంది. ఇషిక లోపలికి వచ్చి గంగకి ఏమైనా అవసరమో అడగడానికి వచ్చానని కవర్ చేస్తుంది. మరొకవైపు వీరుకి స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది. ఫుడ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేసింది మీరే కదా ఒకసారి స్టేషన్ కి రావాలని చెప్తారు. దాంతో వీరు టెన్షన్ పడతాడు. అప్పుడే గంగ వచ్చి ఆ ఫుడ్ ఫెస్టివల్ లో పాయిజన్ పోసింది నువ్వే అని వీరుని అనగానే షాక్ అవుతాడు.

తొందరలోనే నీ నిజస్వరూపం భయటపెడుతానని వీరుకి గంగ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఈ ఇంట్లో గంగ ప్లేస్ పర్మినెంట్ అయ్యేలా ఉంది. శకుంతల అత్తయ్య మనసు మారక ముందే తన మనసులో విషం నింపాలని ఇద్దరు అనుకుంటారు. ఇద్దరు శకుంతల దగ్గరికి వెళ్తారు. గంగ అలా చేసిందంటే తన నిజాయతీని చూపెట్టాలనుకుంటుందేమోనని గంగకి పాజిటివ్ గా శకుంతల మాట్లాడగానే ఇద్దరు షాక్ అవుతారు. అసలు గంగ ఎందుకు వచ్చింది మారువేశంలో వచ్చి తనే ఫుడ్ లో విషం కలిపి కావాలనే డోస్ తక్కువ వేసుకుని తనే ఫుడ్ తిందని ఇషిక చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.